Amazon Forest Secrets: అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే అతి పెద్ద దట్టమైన అటవీ ప్రాంతం. ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ సమయంలో ప్రపంచాన్ని రక్షిస్తోంది ఇదే. అందుకే ఆమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు.
Amazon Forest Secrets: ప్రపంచంలో 20 శాతం ఆక్సిజన్ ఈ అడవి నుంచే పుడుతోంది. అంతు చిక్కని రహస్యాలు, జీవ వైవిద్యం, అతి పెద్ద జంతువులు అన్నీ ఇక్కడే కన్పిస్తాయి. అమెజాన్ అడవి గురించి మరిన్ని అంతుచిక్కని ఆసక్తికర అంశాలు మీ కోసం.
అమెజాన్ అడవి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతి ప్రాచీన అడవి అమెజాన్ ఉష్ణోగ్రతను పెరగకుండా బ్యాలెన్స్ చేస్తోంది. 70 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన అడవి ఇది. ఇది బ్రెజిల్ దేశంలో ఉంది.
అతి ప్రాచీన అడవి అమెజాన్ అడవి దాదాపుగా 5.6 కోట్ల సంవత్సరాలు పాతదని తెలుస్తోంది. ఈ ఆడవిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే ప్రతి రోజూ అణ్వేషణ కొనసాగుతుంటుంది. కోట్లాది సంవత్సరాల క్రితం అతిపెద్ద ఆస్టరాయిడ్ పడటంతో ఈ అడవి ఏర్పడిందని పరిశోధకులు చెబుతున్నారు.
రహస్య మొక్కలు, జీవరాశులు ఈ అడవిలో చాలా అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. ఎన్నో మిస్టరీ మొక్కలు, జీవరాశులు ఉన్నాయి. ఇంకా చాలా జీవరాశులు, మొక్కల గురించి అణ్వేషణ జరగాల్సి ఉంది. ఈ అడవిలో అవకాడో జాతికి చెందిన అన్ని రకాలు లభిస్తాయి.
లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. ఎందుకంటే మనం పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం ఇక్కడే తయారవుతుంది. అమెజాన్ అడవిలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో రెండవ అతి పొడవైన నది
ప్రకటన అమెజాన్ అడవి గురించి ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసమే. ఇందులో సమాచారానికి ఎలాంటి ప్రమాణం జీ న్యూస్ ఇవ్వడం లేదు.