Re Release Highest Collections Movies: ‘మురారి’ సహా రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాలు ఇవే..

Re Release Highest Collections Movies: గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్  కొనసాగుతోంది. ఈ మధ్య ఆ ట్రెండ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు ప్రేక్షకులు. కానీ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ   తెలుగులో రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగులో రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల విషయానికొస్తే..

1 /5

మురారి: మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 8.52 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ ప్లేస్ ఉంది. ఫస్ట్ డే మాత్రం రూ. 2.93 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

2 /5

ఖుషీ: పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 7.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  తాజాగా మురారి మూవీ రాకతో ఈ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కానీ ఈ చిత్రం రీ రిలీజ్ లో మొదటి రోజు రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

3 /5

బిజినెస్ మ్యాన్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ. 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 3లో నిలిచింది. కానీ బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ లో ఫస్ట్ డే రూ. 2.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిం

4 /5

సింహాద్రి: ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సింహాద్రి’.  ఈ సినిమా రీ రిలీజ్ లో రూ. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 4లో  నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో రూ. 1.06 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

5 /5

ఈ నగరానికి ఏమైంది: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.3.52 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు రూ. 81 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.