Pawan Kalyan Loses Cool On His Fans: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన ఒక్కసారిగా అభిమానులపై విరుచుకుపడ్డారు. తన పనులు తనను చేసుకోనివ్వాలని.. అరిస్తే పనులు కావని స్పష్టం చేశారు.
మన్యం జిల్లాలో: మన్యం పార్వతీపురం జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పర్యటించారు.
రోడ్ల పనులు: దాదాపు రూ.36.71 కోట్ల వ్యయంతో 19 నూతన రోడ్లకు సాలూరు నియోజకవర్గం బాగుజోలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేశారు.
ఓజీపై అప్‌డేట్: వెంగళరాయసాగర్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో అభిమానులు గోల చేశారు. ఓజీ.. ఓజీ అంటూ సినిమా అప్‌డేట్ అడిగారు.
తీవ్ర ఆగ్రహం: అభిమానుల నినాదాలపై పవన్ కల్యాణ్ చిర్రెత్తెక్కారు. ‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను' అని అభిమానులపై మండిపడ్డారు.
సినిమా మోజులో: 'ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు' అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు జరగవు: 'నేను మీసం తిప్పితే పనులు జరగవు’ అని అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.