Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..

Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. కానీ కొంత మంది మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసారు.ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.  జనసేనాని కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు ఎవరెవరున్నారంటే..

 

1 /14

పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే.. మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు

2 /14

పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.  

3 /14

రోజా.. రోజా కూడా పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  

4 /14

చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర మంత్రిగా కాకుండా మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ ను స్వతంత్ర్య హోదాలో బాధ్యతలు నిర్వహించారు.

5 /14

బాబు మోహన్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

6 /14

కృష్ణంరాజు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పటి వాజ్ పేయ్ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  

7 /14

సురేష్ గోపీ మలయాళ సూపర్ స్టార్ తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం రేపారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సురేష్ గోపీ.. తొలిసారి లోక్ సభకు ఎన్నికై... నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.

8 /14

చిరాగ్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధ్యక్షుడిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో బిహార్ లోని హాజిపూర్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్యాబినేట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఈయన పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.

9 /14

స్మృతి ఇరానీ.. స్మాల్ స్క్రీన్ స్టార్ స్మృతి ఇరానీ.. 2014, 2019లలో నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర క్యాబినేట్ మంత్రిగా  పలు శాఖలను నిర్వహించారు.

10 /14

వినోద్ ఖన్నా భారతీయ జనతా పార్టీ తరుపున పలుమార్లు ఎంపీగా గెలిచిన నటుడు వినోద్ ఖన్నా.. వాజ్ పేయ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు.

11 /14

శతృఘన్ సిన్హా శతృఘన్ సిన్హా అప్పటి వాజ్ పేయ్ మంత్రి వర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

12 /14

ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం రేపారు. అంతేకాదు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసారు.

13 /14

జయలలిత జయలలిత తమిళనాడు  రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. దాదాపు పలుమార్లు  ముఖ్యమంత్రి అయ్యారు.

14 /14

ఎమ్జీఆర్ భారత దేశంలో ఓ సినీ నటుడు ముఖ్యమంత్రి అయిన సంఘటన ఎమ్జీఆర్ తో మొదలైంది. ఈయన సీఎం కుర్చీలో ఉంటూనే కన్నుమూసారు.