Rakul Preet Singh: భర్తతో యోగా చేస్తూ రకుల్.. ఫోటోలు వైరల్

Rakul Preet Singh International Yoga Day Stills
రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్.. ఆ తరువాత వరుసగా సినిమాలో చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కొద్దిరోజుల నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్..ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అందరిని ఆకట్టుకుంటుంది.

1 /5

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్.. సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.. అని ఈ సినిమాలో రకుల్ చెప్పిన డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది.

2 /5

మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకుల్ కి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్టార్ హీరోలు.. టైర్ 2 హీరోలతో వరస పెట్టి సినిమాలో నటించింది ఈ హీరోయిన్.

3 /5

రకుల్ కెరియర్ తెలుగులో దూసుకుపోతున్న సమయంలోనే హిందీలోకి కూడా అడుగు పెట్టింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి హిందీలో అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. మరోపక్క ఈ హీరోయిన్ కి తెలుగులో కూడా వరుస ప్లాపులు రావడం మొదలయ్యాయి. దాంతో తెలుగు సినిమాల ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.  

4 /5

ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న.. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో.. జాకీ భగ్నానీని వివాహ చేసుకుంది. బాలీవుడ్ కి చెందిన ఈ నిర్మాతతో కొద్ది సంవత్సరాల పాటు ప్రేమలో ఉండింది రకుల్. ఇక పెళ్లి చేసుకున్న.. రకుల్ ప్రస్తుతం కూడా పలు హిందీ సినిమాలను సైన్ చేసింది.  

5 /5

తెలుగులో మాత్రం రకుల్ కి ఇంకా అనుకున్న స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఈ క్రమంలో ఈ హీరోయిన్.. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే..సందర్భంగా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.