Rashmika Mandanna: మన దేశంలో ప్రెజెంట్ అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత గతేడాది ‘యానిమల్’ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ఇపుడు రాబోయే పుష్ప2తో మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడానికి రెడీ అవుతోంది.
రష్మిక మందన్న శాండిల్ వుడ్ అయినా.. తెలుగులో ‘ఛలో’ చిత్రంతో పరిచయమైంది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.
ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో పుష్ప, యానిమిల్ చిత్రాలతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ‘పుష్ప 2’ చిత్రంతో పలకరించబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులను రష్మిక స్టార్ట్ చేసింది.
ఈ సినిమా కోసం రష్మిక తెలుగుతో పాటు కన్నడ, హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఓ రకంగా ఇపుడున్న కథానాయికలకు ఆదర్శంగా నిలుస్తుంది.
పుష్ప సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసారు. పాట్నా నుంచి మొదలు పెడితే.. ముంబై, కోల్ కతా, చైన్నై, బెంగళూరు, కొచ్చిలలో ప్లాన్ చేసారు.
అటు బాలీవుడ్ లో సల్మాన్, మురుగదాస్ ‘సికిందర్’ సినిమాల్లో నటిస్తోంది. రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.
రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తోంది. రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.