Ravichandran Ashwin: క్రికెట్‌కు వీడ్కోలుపై స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే రిటైర్‌మెంట్‌?

Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ముందు భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్‌ కెరీర్‌లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్‌ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో కలకలం రేపాయి.

1 /6

Ravichandran Ashwin Will Be Retire: భారత జట్టు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టెస్టులు మాత్రమే ఆడుతున్న అశ్విన్ తన క్రికెట్‌ భవిష్యత్తు విషయమై మాట్లాడాడు.

2 /6

Ravichandran Ashwin Will Be Retire: బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం సమయంలో తన క్రికెట్‌ భవిష్యత్‌పై స్పందిస్తూ.. 'క్రికెట్‌ నుంచి వైదొలగడంపై ఇంకా ఆలోచించడం లేదు' అని అశ్విన్‌ చెప్పాడు.

3 /6

Ravichandran Ashwin Will Be Retire: 'ప్రస్తుతం నా మనసులో అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు నేను ప్రతిరోజూ అదనంగా శ్రమిస్తున్నా.. ఎక్కువ సాధన చేస్తున్నా. 3-4 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా' అని అశ్విన్ తెలిపాడు.  

4 /6

Ravichandran Ashwin Will Be Retire: తాను ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదని.. అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని అశ్విన్‌ స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు ప్రతి మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

5 /6

Ravichandran Ashwin Will Be Retire: ప్రస్తుతం తన కెరీర్‌లోని ప్రధాన దశను ఎంజాయ్ చేస్తున్నట్లు అశ్విన్‌ తెలిపాడు. క్రికెట్ రాకపోతే అదే రోజు సెలవు ప్రకటిస్తానని.. మరొకరు వచ్చి భారత క్రికెట్‌ను మరింత మెరుగుపరుస్తారని పేర్కొన్నారు.

6 /6

Ravichandran Ashwin Will Be Retire: ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 516 టెస్టు వికెట్లతో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ సిరీస్‌తోపాటు రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో కూడా అశ్విన్‌ ఆడనున్నాడు.