Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోజు నుంచే అప్లికేషన్ లు..

New Ration cards in Telangana:  సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మరో బంపర్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు గత కొన్నిరోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.
 

1 /7

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలు కొన్నినెలలుగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై రాజకీయ దుమారం కూడా రాజుకుంది. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (గురువారం) కీలక ప్రకటన చేశారు.  

2 /7

 తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రేష‌న్ కార్డుల జారీకి విధివిధానాలు త్వరగా రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. త్వరలోనే కొత్త తెల్ల రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం.

3 /7

ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారి నుంచి అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్ లను అధికారులు తీసుకుంటారని కూడా వెల్లడించారు. అంతేకాకుండా.. రేషన్‌ కార్డులు పొందడానికి అర్హతలున్న ప్రజలు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. అలాంటి వారందరికి న్యాయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోగా, బీఆర్‌ఎస్‌ హయాంలో రెండున్నర సంవత్స రాల క్రితం మళ్లీ ఆ ప్రస్తావన వచ్చింది.   

4 /7

2021 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో కొత్త కార్డుల ప్రక్రియ తెరపైకి రాగా, అర్హతగల వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు.. రెండున్నరేళ్లు గడిచినా తిరిగి కొత్త కార్డుల మాట మాత్రం ఎత్తలేదు.  కొత్త రేష‌న్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబ‌రు 2 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని సీఎం రేవంత్‌ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.   

5 /7

రేవంత్ సర్కారు ప్రకటనతో..  తెలంగాణలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, అర్హతగల వారికి త్వరలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం కలగనుందని చెప్పుకొవచ్చు. ప్రజలకు కొత్త రేషన్‌ కార్డులు అందజేసే క్రమంలో విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.   

6 /7

ఈ మేరకు కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం క్యాబినెట్‌ స్థాయిలో సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  కీలక ఆదేశాలను సైతం జారీ చేసింది.ముఖ్యంగా పేదప్రజలకు...ప్రజా పంపిణీ వ్యవస్థకు, ఆరోగ్య శ్రీ పథకానికి వేర్వేరుగా తెల్లరేషన్‌ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇటీవల సమావేశమైన సబ్‌ కమిటీ పేర్కొంది. 

7 /7

కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం పట్టణాల్లో రూ. 2 లక్షల్లోపు, గ్రామాల్లో రూ. లక్షన్నర వార్షికాదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు లేదా చెల్క 7.5 ఎకరాల్లోపు ఉన్నవారికే తెల్ల కార్డులు ఇవ్వాలని ప్రతిపాదించింది. మరోవైపు దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారు ఎవరూ తెల్లకార్డు అవకాశం కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న వాళ్లు సంతోషంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం కొత్తగా అప్లికేషన్ లు చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు.