Customizing Royal Enfield | ప్రీమియర్ మోటార్ సైకిల్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield ) ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులు సంస్థ పాపులర్ బ్రాండ్స్ అయిన Classic 350 Dual Channel , Meteor సొంతంగా డిజైన్ చేసుకుని బుక చేసుకోవచ్చు.
దీని కోసం మీరు కాస్త డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు కస్టమర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవలే Classic 350 క్లాసిక్ మోటార్ సైకిల్ ను మరో రెండు కొత్త రంగుల్లో విడుదల చేసింది.
Meteor ను సొంతంగా డిజైన్ చేసుకోవాలి అంటే మీరు https://makeityours.royalenfield.com/ అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అక్కడ ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ZeeBiz/RE)
ఈ వెబ్సైట్లో మీరు 3డీ కంఫిగరేషన్ విధానంలో మీ బైక్ డిజైన్ చేసుకోవచ్చు. బుకింగ్ కు ముందు మీరు సొంతంగా బైక్ ను బుక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ( ZeeBiz/RE)
స్టైల్లో మీరు ఫ్యూయల్ ట్యాంకు కలర్, సైలెన్సర్, అద్దాలు ఎంచుకోవచ్చు. మోటార్ సైకిల్ 3డీ వ్యూ లభిస్తుంది. దాని సహాయంతో మీరు కొన్ని మార్పులు చేసుకోవచ్చు.
జిన్ గార్డు డిజైన్ చేసుకోవచ్చు. ఈ గార్డు ధర 2400 నుంచి 3800 వరకు లభిస్తుంది.
మోటర్ సైకిల్ ప్రొటెక్షన్ విషయంలో నచ్చిన విధంగా ఇంమోటార్ సైకిల్ రైడర్లకు ఆప్షన్లు చాలా ఇంపార్టెంట్. దీని కోసం మోటార్ సైకిల్లో ఫుట్ స్పేస్, సైడ్ బాక్స్, ఇంజిన్ బాక్స్ మార్చుకోవచ్చు. ( ZeeBiz/RE)
దీంతో పాటు విండ్ షీల్డ్, బ్యాక్ రెస్ట్ వంటివి మార్చు కోవచ్చు.( ZeeBiz/RE)