Sai Pallavi Birthday Celebrations: తండేల్ సెట్స్‌లో ఘ‌నంగా సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే వేడుక‌లు.. పిక్స్ వైర‌ల్..

Sai Pallavi Birthday Celebrations:  సాయి ప‌ల్ల‌వి.. లేడీ ప‌వ‌ర్ స్టార్.  సినిమా ఇండ‌స్ట్రీలో అందం ఉంటేనే రాణిస్తారు. అలాంటి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న దైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా ఈమె బ‌ర్త్ డే వేడుక‌లు తండేల్ సెట్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1 /5

సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే వేడుక‌లు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య హీరోగా న‌టిస్తోన్న తండేల్ మూవీ సెట్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.

2 /5

 సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే వేడుక‌ల్లో  నిర్మాత అల్లు అర‌వింద్, హీరో నాగ చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందూ మొండేటి పాల్గోన్నారు.

3 /5

సాయి ప‌ల్ల‌వి 1992 మే 9న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ జిల్లాలో జ‌న్మించింది. 2005 నుంచి 2009 వ‌ర‌కు జూనియర్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేసిన సాయి ప‌ల్ల‌వి.. 2015 నుంచి లీడ్ యాక్ట్రెస్‌గా స‌త్తా చూపెడుతోంది.

4 /5

మ‌ల‌యాళంలో ప్రేమ‌మ్ మూవీలో మ‌ల‌ర్ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ సినిమాకు సాయి ప‌ల్ల‌వి కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసింది.  

5 /5

ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ సినీ ఇండ‌స్ట్రీకే ప‌రిమితమైన సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లో రామాయ‌ణం మూవీలో సీత పాత్ర‌లో ప్యాన్ ఇండియా లెవల్లో అల‌రించ‌బోతుంది.