Lunar Eclipse 2024: రెండో చంద్ర గ్రహణం ఈ నెలలో ఎప్పుడు రానుంది తెలుసా? సూతక కాలం ఎప్పుడు ప్రారంభం?

Second Lunar Eclipse 2024: సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇది ముల్లోకాలపై ప్రభావం పడుతుంది అంటారు. అయితే, ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం ఈ సెప్టెంబర్‌ మాసంలోనే ఏర్పడనుంది. అయితే, ఈ గ్రహణం ఏరోజు? ఎప్పుడు? ప్రారంభమవుతుంది? తెలుసుకోండి.
 

1 /5

సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా అశుభం అని మన జ్యోతిష్యులు చెబుతారు. ఇవి 12 రాశులపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణులు బయటకు రాకూడదని అంటారు. వారు ఏ పనిచేయకూడదు.   

2 /5

ఈ నెలలో సెప్టెంబర్‌ 18వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే, ఈ మాసంలోనే పితృపక్షం రోజులు కూడా ప్రారంభం అవుతాయి. చంద్ర గ్రహణం ఉదయం 6:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది ఉదయం 10:17 గంటలకు పూర్తవుతుంది. మొత్తం చంద్ర గ్రహణం సమయం 4 గంటల 6 నిమిషాలు.  

3 /5

సూతకం అంటే అశుభ సమయం అంటారు. సాధారణంగా ఈ చంద్ర గ్రహణం మన దేశంలో కనిపించదు. మనకు సూతకం కూడా ఉండదు. గ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ రెండో చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆఫ్రిక, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్‌, పసిఫిక్ సముద్రం, అంటార్కిటిక్‌, అట్లాంటిక్ సముద్రం వద్ద కనిపిస్తుంది.   

4 /5

రాశులపై చంద్రగ్రహణ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ, మేషం, కర్కాటకం, తుల, మకర రాశిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి.  

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)