Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహా విష్ణువు ఎత్తిన పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదవది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపర యుగంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే.
శ్రీ కృష్ణుడి లీలా విన్యాసాలు అనంతం. అటువంటి భగవంతుడు చిన్న కృష్ణయ్యగా గోపిలందరిని ఆటపట్టించాడు. వెన్ను దొంగ పేరు తెచ్చుకున్నాడు. అటు ధర్మబద్ద జీవితాన్ని గడపడానికి మానవాళికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టామి. తెలుగు తెరపై ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడి పాత్రలో మెప్పించారు.
మహా భారతంతో పద్దెనిమిది పర్వాల మాదిరిగానే.. ఆయన పద్దెనిమిది సినిమాల్లో శ్రీకృష్ణ పాత్రల్లో మెప్పించారు. మాయా బజార్ నుంచి శ్రీ మద్విరాట పర్వం వరకు దాదాపు 18 సినిమాల్లో శ్రీ కృష్ణ భగవాడి పాత్రలో మెప్పించారు. సినిమాల్లోని అంతర్నాటకాల్లో కలిసి 33సార్లు శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించారు.
శోభన్ బాబు.. ఎన్టీఆర్ తర్వాత శోభన్ బాబు ‘బుద్దిమంతుడు’, ‘కురుక్షేత్రం’ సినిమాల్లో శ్రీకృష్ణ పాత్రల్లో మెప్పించడం విశేషం. అటు అక్కినేని నాగేశ్వరరావు ‘గోవుల గోపన్న’ చిత్రంలో ఓ పాటలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించారు.
ఎన్టీఆర్, శోభన్ బాబు మధ్యలో కాంతారావు ‘నర్తనశాల’ సహా పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్రల్లో మెప్పించడం విశేషం.
నందమూరి బాలకృష్ణ అవతార పురుషుడిగా.. శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు రోహిణి నక్షత్రముతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా మధుర లో ఉన్న చెరసాలలో జన్మించాడు. అందుకే ఈ రోజుని కృష్ణాష్టమిగా... జన్మాష్టమిగా పిలుస్తారు. ఇక ఈ తరంలో నందమూరి బాలకృష్ణ కూడా శ్రీ కృష్ణార్జున విజయంతో పాటు పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణ పాత్రల్లో మెప్పించడం విశేషం.
రాజేంద్ర ప్రసాద్.. దుష్టులను శిక్షిస్తూ..శిష్టులను రక్షిస్తూ ధర్మసంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. అటు తెలుగు తెరపై రాజేంద్ర ప్రసాద్ కూడా ‘కన్నయ్య కిట్టయ్య’ చిత్రంలో కన్నయ్య పాత్రలో మెప్పించడం విశేషం.
కృష్ణార్జున.. కృష్ణార్జున చిత్రంలో నాగార్జున.. మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సరైన విజయం సాధించలేదు.
గోపాల గోపాల.. గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ కూడా మోడ్రన్ శ్రీ కృష్ణుడి పాత్రలో మెప్పించడం విశేషం. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పవన్ అభిమానులకు తీపి గురుతు.
వీళ్లతో పాటు ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించడం విశేషం. యశోదా కృష్ణలో బాలకృష్ణుడిగా శ్రీదేవి, ఆ తర్వాత అవతారపురుషుడిగా రామకృష్ణ నటించారు. అటు శ్రీకృష్ణావతారం సినిమాలో చిన్నప్పటి కృష్ణుడి పాత్రలో హరికృష్ణ.. పాండురంగ మహత్యంలో విజయ నిర్మల, అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ‘దాన వీర శూర కర్ణ’లో మాస్టర్ ఎన్టీఆర్, కన్నడ కురుక్షేత్రంలో రవిచంద్రన్ శ్రీ కృష్ణుడి పాత్రలో మెప్పించారు. అటు యువరాజులో మహేష్ బాబు కాసేపు అలా శ్రీ కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించిన వాళ్లలో ఉన్నారు.