Sreeleela:బ్లాక్ శారీలో కిరాక్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న శ్రీలీల..

Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్‌లా దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

1 /6

శ్రీలీల.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

2 /6

సినీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం తెలుగులో  వరుస అవకాశాలతో  క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3 /6

శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో వార్తల్లో  నిలిచింది. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీల ఫేట్ మారిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

4 /6

గతేడాది శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది. ఇందులో బాలకృష్ణ బిడ్డ పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

5 /6

హీరోయిన్‌గా కేవలం యంగ్ హీరోల సరసనే కాకుండా టాప్ స్టార్స్ సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ యేడాది మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది.

6 /6

గుంటూరు కారం భారీ హిట్ కాలేదు.. అలా అని డిజాస్టర్ కాలేదు.  ఓ మోస్తరు విజయంతో శ్రీలీల కెరీర్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.