Heavy Rains: హైదరాబాద్ లో దట్టంగా అలుముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం..


Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు రోజుల నుంచి ఉక్కపోతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ కేంద్రం రానున్న ఐదురోజుల పాటు వర్షం పడుతుందని ఆల్రెడీ అలర్ట్ జారీచేసింది. 

1 /6

హైదరాబాద్ లో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దీంతో చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. రెండు గంటల నుంచి ఏకధాటిగా పలు ప్రాంతాలలో వర్షం పడుతుంది. 

2 /6

వర్షం గ్యాప్ లేకుండా కురుస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనాలు ముందుకు వెళ్లలేక.. ట్రాఫిక్ లో ఒక్కసారిగా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. రోడ్లపైన గుంతలలో నీళ్లు నిలిచి పోవడంతో వాహనాలు కూడా గుంతల వల్ల వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.

3 /6

ఇక బక్రీద్ పండుగ నేపథ్యంలో షాపింగ్ చేద్దామని బైటకు వచ్చిన వారు వర్షానికి తడిసిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ అంతాట జనజీవనం ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరో మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు పడతాయని తెలుస్తోంది.

4 /6

ఇప్పటికే స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు పిల్లలు సాయంత్రం వేళ స్కూళ్లనుంచి బైటకు వస్తుంటారు. ఈ క్రమంలో వర్షం పడుతుండటంతో జనాలు అవస్థలు పడుతున్నారు. 

5 /6

హైదరాబాద్ లోని సోమాజిగూడ, సికింద్రాబాద్,లింగం పల్లి, చందానగర్, జూబ్లీహిల్స్, హైటేక్ సిటీ, దిల్ సుఖ్ నగర్, మోహిదీపట్నం, పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక మేడ్చల్ లో కూడా వర్షం పడుతున్నట్లు తెలుస్తోంది.

6 /6

తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా వర్షం కురుస్తుంది. నిజామాబాద్, నిర్మల్ , ఆదిలాబాద్, తాండూరు, కరీంగనగర్, వరంగల్, ఖమ్మం వంటి మొదలైన జిల్లాలలో వర్షం కురుస్తుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా భారీనుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీచేసింది.