Hyderabad Rains: జీహెచ్ఎంసీ అలర్ట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం.. టోల్ ఫ్రీ నంబర్ లు ఇవే..

TS weather:  రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
 

1 /6

తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు ఎన్నికలలో ఓట్లు వేయడానికి జనాలు తమ గ్రామాలకు తరలిపోతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు, విమానాల్లో ఫుల్ రద్దీ నెలకొంది. ఇక ప్రస్తుతం ఎన్నికలు సంక్రాంతి పండుగను తలపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి భారీగా జనాలు తమ గ్రామాలకు వెళ్లడంతో భాగ్య నగరం బోసిపొయింది.

2 /6

ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఎండలు దంచికొట్టాయి. భానుడు తన ప్రతాపం చూపించాడు. ఎండల వేడికి జనాలు అల్లాడిపోయారు. ఈ  నేపథ్యంలో.. ఉష్ణోగ్రతలకు 47 డిగ్రీలకు వరకు కూడా చేరుకున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు.

3 /6

ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపొయింది. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనాలు కాస్త, వర్షంకురుస్తుండటంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో మూడు రోజులు తెలుగు స్టేట్స్ లలో వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడింది. దీన్ని ప్రకారమే.. హైదరాబాద్ లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

4 /6

ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో ఎన్నికలకేంద్రానికి చేరుకుంటున్న సిబ్బంది కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తొంది. ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో వర్షంకు ఇబ్బందులు కల్గకుండా జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేశారు. ఇటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వర్షం పడితే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసుకుంటున్నారు.  

5 /6

మరోవైపు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది,ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీనంబర్ లను ప్రకటించారు. జీహెచ్ఎంసీ-డీఆర్ఎఫ్ సహాయం కోసం.. 040-2111 1111,90001 13667 లకు ఫోన్ చేసి సమస్యలను చెప్పవచ్చని తెలిపారు.

6 /6

హైదరాబాద్ లో మరో మూడు రోజులపాటు వాతావరణం చల్లబడి, తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. వర్షంవేళ ప్రజలు బైటకు రావోద్దని, ఏవైన సమస్యలుంటే తమకు కాల్ చేయాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.