YS Sharmila Gets Emotional On Viajayawada Floods Victims: విజయవాడ వరద బాధితులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. నీట మునిగిన సింగ్ నగర్‌లో పర్యటించి వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించారు. బట్టలు, ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila: విజయవాడ వరద బాధితులను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. సింగ్‌నగర్‌లో వరదలో నడుచుకుంటూ వెళ్లి బాధితులను కలిశారు.
YS Sharmila: బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసిన ఆమె తన గుండె తరుక్కుపోయిందని తెలిపారు.
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల బాధితులకు తోచి సహాయం అందించారు.
YS Sharmila: ఏపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని బాధితులు ఆమె ముందు వాపోయారు.
YS Sharmila: ఆందోళన చెందవద్దని మీకు అండగా ఉంటామని బాధితులకు షర్మిల భరోసా ఇచ్చారు.
YS Sharmila: అంతకుముందు షర్మిల ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.