Crocodile Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. గ్రూపుగా ఉన్న మొసళ్లను ఎలా కంట్రోల్ చేసాడో చూడండి!

ప్రస్తుతం మొసళ్లకు ఆహారం తినిపిస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి ఆహారం తినిపించడం, అవి తను చెప్పిన విధంగా వినటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ క్రేజీ వీడియోని మీరు ఒకసారి చూడండి. 

Last Updated : Apr 19, 2023, 04:41 PM IST
Crocodile Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. గ్రూపుగా ఉన్న మొసళ్లను ఎలా కంట్రోల్ చేసాడో చూడండి!

Crocodile Viral Video: సోషల్ మీడియా ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది.  అలాగే చాలా రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రత్యేకంగా కొన్ని జంతువుల వీడియోలకి మాత్రం వైరల్ అవ్వటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. హానికర జంతువుల వీడియోలు సంగతి అయితే  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా భయంకర జంతువులు అయినట్టి పాములు, సింహాలు, నీటి గుర్రాలు, ఎలుగు బంతి వంటి వాటి వీడియోలు రోజుకు ఒకటి వైరల్ అవుతుంటాయి. ఈ రోజు వైరల్ వీడియోల గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. ప్రస్తుతం ట్విట్టలో మొసళ్ల గ్రూపుతో ఉన్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది. 

నీటిలో అత్యంత భయంకర జంతువులలో మొసలి కూడా ఒకటి. నీటిలో ఎంతటి జంతువునైనా లొంగదీసుకునే కెపాసిటీ మొసలికి ఉంది. ఒకసారి మొసలికి నీటికి చిక్కితే బయటపడటం ఎంత కష్టమో మన అందరికి తెలిసిందే! నీటి నుండి బయటకు వచ్చి కూడా వేటాడే అవకాశం ఉన్నప్పటికీ, నీటిలో పోలిస్తే భూమి పై వాటి వేగం అంతగా ఉండదు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే.. ఒక వ్యక్తి నది ఒడ్డుకు సంచితో వచ్చి కూర్చున్నాడు. అతడిని వద్దకు చాలా మొసళ్లు లైన్లో వచ్చి ఉంటాయి. ఆ వ్యక్తి కూడా ఎలాంటి భయం లేకుండా అలానే కూర్చోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

అసలు కథ: 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒడ్డుకు వచ్చి కూర్చొన్న వ్యక్తి దగ్గర ఒక సంచితో పటు కర్ర కూడా ఉంది. కొంత సమయం అవ్వగానే చాలా మొసళ్లు వరుసగా రావటం ప్రారంభించాయి. వచ్చిన మొసళ్లకు సంచిలోంచి ఆహారం తీసి వేయటం మనం చూడవచ్చు. సంచిలోంచి ఆహరం తీసి వాటి ముక్కు దగ్గర వాసన చూపించటం.. వెంటనే అవి నోరు తెరవటం మనం చూడవచ్చు. 
నోరు తెరచిన మొసళ్లకి ఆ వ్యక్తి ఆహారం తినిపించడం మనం వీడియోలో చూడవచ్చు. 

Also Read: Monkey Rescues Kitten: మంచితనం తెలిసిన కోతి పిల్ల.. నీ జాలి గుండెకు హ్యాట్సాఫ్.. వైరల్ వీడియో

ఒక్కో క్షణంలో అతడి చేయిని తినేశాయేమో  అని కూడా మనకు అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే.. అవకాశం ఉన్నప్పటికీ ఆ మొసళ్లు అతడిని ఏమి అనకుండా కేవలం అతడి చెప్పిన విధంగా ఆహరం తినటం.. వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడికి వచ్చిన వ్యక్తికీ ఆ మొసళ్లతో స్నేహం ఉందా.. ? లేక అవి అతడి పెంపుడు మొసళ్లా.. అని ఎవరికీ తెలీదు. సాధారణంగా ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు ఎక్కడ చూసి ఉండము. ఈ వీడియో @cctvidiots అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేయగా.. కొన్ని సెకన్లలోనే ఈ వీడియోకి లక్షల వ్యూస్ రావటం విశేషం.

Also Read: Dead Man Returns Home: కరోనాతో చనిపోయిన తర్వాత రెండేళ్లకు తిరిగొచ్చి షాకిచ్చాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

FacebookTwitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News