Social Media Viral: రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ధర 1986లో ఎంతో తెలుసా? ఇదిగో బిల్ చూడండి..!

Royal Enfield Bullet 350: మీరు సుమారు రూ. 1.8 లక్షలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్‌ను పొందుతారు. అయితే 1986లో ఈ బైక్ ధర ఎంతో తెలుసా? అప్పటి బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2024, 12:04 PM IST
Social Media Viral: రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ధర 1986లో ఎంతో తెలుసా? ఇదిగో బిల్ చూడండి..!

Royal Enfield Bullet 350: మీరు సుమారు రూ. 1.8 లక్షలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్‌ను పొందుతారు. అయితే 1986లో ఈ బైక్ ధర ఎంతో తెలుసా? అప్పటి బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఇది చాలా ఏళ్లుగా వినియోగదారుల హృదయాలను శాసిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ఈ బైక్‌లో అనేక మార్పులు చేసింది, అయితే దీని ప్రాథమిక రూపం అలాగే ఉంది. కాలంతో పాటు బైక్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం మీరు ఈ బైక్‌ను దాదాపు రూ. 1.8 లక్షలకు పొందుతారు. అయితే 1986లో ఈ బైక్ ధర ఎంతో తెలుసా?

ఇదీ చదవండి: కోర్టు విచారణలో లేడీ జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన దొంగ..! మిలియన్ల మంది వీక్షించిన వీడియో..

1986లో కొనుగోలు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ  బైక్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బిల్లులో బైక్ ఆన్-రోడ్ ధర రూ.18,700 మాత్రమే. అంటే దాదాపు 36 ఏళ్ల నాటి బైక్ ధర. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ మోడల్ వైరల్ బిల్లును జార్ఖండ్‌లోని సందీప్ ఆటో కంపెనీ జారీ చేసింది.

 

ఇదీ చదవండి: కళ్లు తెరిచి మూసేలోగా రంగు మారుస్తున్న చేప..వీడియో చూడండి..!

కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పురాతన బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఒకటి. అయితే, ఈ కంపెనీ త్వరలో భారతదేశంలో 650సీసీ ఇంజిన్‌తో కొత్త బుల్లెట్‌ను విడుదల చేయడానికి యోచిస్తోంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350,500సీసీ ఇంజన్ ఆప్షన్‌లతో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News