PIB Fact Check: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల దృష్టిని ఆకర్షించే ఏ వార్తయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇదే అదనుగా కొంతమంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ ఫోన్ నంబర్‌కు భారీ లాటరీ తగిలిందనో లేక భారీ ప్రైజ్ మనీ గెలుకున్నారనో ఫేక్ మెసేజ్‌లు పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధార్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం రూ.4,78,000 రుణం అందిస్తోందనేది ఆ మెసేజ్ సారాంశం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాన్ని పొందాలంటే.. మెసేజ్‌లో ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని అందులో సూచన ఉంటుంది. ఒకవేళ ఆ లింకుపై క్లిక్ చేశారంటే సైబర్ క్రిమినల్స్ ట్రాప్‌లో పడినట్లే. ఇది పూర్తిగా ఫేక్ మెసేజ్ అని, కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్స్ ఏవి ప్రకటించలేదని తాజాగా 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ఫ్యాక్ట్ చెక్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఇలాంటి మెసేజ్‌లు వస్తే అందులోని లింకులపై క్లిక్ చేయవద్దని తెలిపింది. వాటిని ఎవరికీ షేర్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలను, ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ మెసేజ్‌లు ఎలా పొందాలి :
సోషల్ మీడియా ద్వారా అందిన ఏదైనా మెసేజ్ పట్ల మీకు సందేహం లేదా అనుమానం ఉన్నట్లయితే ఆ మెసేజ్‌ను పీఐబీ (Press Information Bureau)కి పంపించి అందులో నిజానిజాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆ మెసేజ్‌ను https://factcheck.pib.gov.in. వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలి. లేదా +918799711259 వాట్సాప్ నంబర్‌కి పంపించాలి. pibfactcheck@gmail.com. మెయిల్‌కి కూడా మెసేజ్‌లు పంపించవచ్చు. ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో https://pib.gov.in.లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది.
Also Read: Munugode ByPoll Live Updates: జగదీశ్ రెడ్డికి బిగ్ షాక్.. 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు బీజేపీకి జంప్
Also Read: Viral Video Today: పులికే చుచ్చు పోయించిన పిల్లి.. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Fact Check: ఆధార్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం నుంచి రూ.4 లక్షల లోన్... ఇందులో నిజమెంత..?
ఆధార్ కార్డు కలిగినవారికి కేంద్రం లోన్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్
ఈ మెసేజ్‌లో నిజమెంత..