Google Copy Right Dispute: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు భారీ షాక్ ఎదురైంది. అందరికీ కాపీరైట్ నిబంధనల్ని స్ట్రైక్ చేసే గూగుల్ స్వయంగా కాపీరైట్ వివాదంలో కూరుకుంది. భారీ జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి తెచ్చుకుంది.
గూగుల్(Google)సంస్థ కూడా తప్పు చేసింది. అది కూడా కాపీరైట్ ఉల్లంఘన. అందరికీ కాపీరైట్ స్ట్రైక్స్ ఇచ్చే గూగుల్ స్వయంగా అదే వివాధంలో కూరుకుంది. ఫలితంగా భారీగా జరిమానా చెల్లించుకునే పరిస్థితి తెచ్చుకుంది. గూగుల్ సంస్థకు ఫ్రాన్స్(France) భారీ ఎత్తున జరిమానా విధించింది. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్‌సైట్‌లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో అభ్యంతరం తెలిపాయి. అంతేకాకుండా కాపీరైట్స్ ఉల్లంఘన(Copyright Violation) కింద ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. దాంతో ఫ్రాన్స్ కాంపిటిషన్ రెగ్యులేటర్..మీడియా సంస్థలతో సంప్రదించాలని గూగుల్‌కు సూచించినా..ఆ సంస్థ నిర్లక్ష్యం వహించింది. దాంతో యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్స్(Antitrust regulators) కింద ఫ్రాన్స్..గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. మీడియా హౌస్‌ల న్యూస్ కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటోందని చెబుతూ 5 వందల మిలియన్ యూరోలు ఫైన్ వేసింది ఫ్రాన్స్ (France). అంటే అక్షరాలా 4 వేల 415 కోట్ల జరిమానా (Fine)అన్నమాట. జరిమానా విధించడమే కాకుండా కాపీరైట్ కంటెంట్ వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also read: Aadhaar Card Update: మీ ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌తో అప్‌డేట్ చేయడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook