Ghost Signs: దెయ్యాలంటే ఎంత భయపడతారో తెలుసుకునేందుకు అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ఆందుకే ఎంత భయం ఆవహించినా హారర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువే ఉంటుంది. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందాక కూడా దెయ్యాలున్నాయంటే ఎలా అని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. కానీ అదే సమయంలో సైన్స్‌కు చిక్కని ఎన్నో విషయాలు దెయ్యాలున్నాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటాయి.
సైన్స్‌ను నమ్మేవాళ్లు దెయ్యాలు లేవంటారు. కానీ దేవుడిని అమితంగా ఆరాధిస్తారు. మరి దేవుడిని నమ్మినప్పుడు దెయ్యాల్ని నమ్మాలి కదా అని వాదించేవాళ్లుంటారు. దెయ్యాలున్నాయా లేవా అనేది తర్కానికి అందని ప్రశ్న. నమ్మకానికి సంబంధించింది. ఆలోచనలు, ఊహలకు సంబంధించింది. కొందరికి అనుభవం కలగవచ్చు. కొందరికి కలగకపోవచ్చు. దెయ్యాలున్నాయా లేవా అనేది కాస్సేపు పక్కనబెడితే...కొన్ని సంకేతాల ద్వారా దెయ్యాలు చుట్టుపక్కల ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పారానార్మల్ పరిశోథకులు చెబుతున్నారు. అంటే ఈ సంకేతాలు మీకు కన్పించినా అక్కడ దెయ్యాలున్నాయని అర్ధం చేసుకోవాలట.
కొన్ని ఇళ్లలో తరచూ ఆహార పదార్ధాలు పాడైపోవడం, ఇంట్లో చెత్త చెదారం పేరుకుపోవడం జరుగుతుంటుంది. మీ ఇంట్లో ఇలా ఉంటే దెయ్యం ఉందని సంకేతమంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ఇళ్లలో బల్బులు వెలుగుతూ, ఆరుతూ లేదా ఉన్నట్టుండి మాడిపోవడం, పగిలిపోవడం గమనించవచ్చు. ఇలా ఉంటే ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నట్టు అర్ధంంటున్నారు.
ఒక్కోసారి రాత్రి వేళ అడుగుల చప్పుడు, అసహజమైన ధ్వనులు విన్పిస్తుంటాయి. మీక్కూడా అలా అన్పిస్తే అక్కడ ఆత్మలు సంచరిస్తున్నట్టు అర్ధం చేసుకోవాలి.
ఒక్కోసారి ఇంట్లోనే మంచి సువాసన వస్తుంటుంది. ఎలాంటి స్ప్రే కొట్టకపోయినా, ఏ విధమైన సెంట్ రాయకపోయినా అలాంటి వాసన వస్తుందంటే దెయ్యాలు తిరుగుతున్నాయని అర్ధం.
చాలామంది దెయ్యాల గురించి మాట్లాడుకోవడం, హారర్ సినిమాలు చూస్తుండటం చేస్తుంటారు. ఇలా చేయడమంటే దెయ్యాల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు లెక్క. అంతేకాకుండా చాలాకాలంగా మనుషుల సంచారం లేని ప్రాంతాల్లో, ఇళ్లలోకి వెళ్లవద్దంటున్నారు.
ఇంట్లో గడియారం అస్తమానూ ఒకే సమయంలో ఆగిపోతుంటే, ఎలాంటి గాలి లేకపోయినా కిటికీలు కొట్టుకుంటుంటే ఆత్మలు సంచరిస్తున్నాయని అర్ధం.
ఇంట్లో లేదా పెరట్లో ఏమీ లేకుండానే కుక్కలు అదే పనిగా మొరుగుతుంటే అక్కడ దెయ్యాలున్నట్టు అర్ధంఎందుకంటే జంతువులకు అతీంద్రియ శక్తుల్ని గుర్తించే సామర్ధ్యం ఉంటుందంటారు.
Also read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇవాళే లాస్ట్, OnePlus Nord CE3పై భారీ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook