Work from Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రాచుర్యంలో పొందింది ఒక్కటే. అది వర్క్ ఫ్రం హోం. కార్పొరేట్, ఉద్యోగులకు ఇద్దరికీ ఈ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వర్క్ ఫ్రం హోంలో గూగుల్ సంస్థకు ఎంత లాభమొచ్చిందో తెలుసా
కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా ప్రపంచమంతా 2020లో లాక్డౌన్లో ఉంది. ఇంచుమించు అన్ని కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. అంటే వర్క్ ఫ్రం హోం( Work from Home). ఈ కాన్సెప్ట్ అటు ఉద్యోగులు, ఇటు కంపెనీలకు చాలావరకూ కలిసొచ్చింది. ముఖ్యంగా గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి టెక్ కంపెనీలకు చాలా వరకూ లబ్ది చేకూరింది. కారణం ఆఫీసుల్లో ఉండే ఇతరత్రా ఖర్చులు తగ్గిపోవడమే. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్‌కు ఏకంగా 7 వేల 4 వందల కోట్ల రూపాయలు అదనపు ఖర్చు కలిసొచ్చిందట.
బ్లూమ్‌బర్ల్ ( Bloomberg) విడుదల చేసిన నివేదిక ప్రకారం గూగుల్ (Google)పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ తొలి త్రైమాసికంలో ప్రమోషన్స్, ప్రయాణాలు, ఎంటర్టైన్మెంట్కు సంబంధించి 2020తో పోలిస్తే 268 మిలియన్లు ఆదా చేసింది. ఏడాదికి ఒక బిలియన్ ఉండవచ్చని అంచనా. డిజిటల్ ఈవెంట్స్ కారణంగా 2020లో గూగుల్ (Google)ప్రకటనలు, ప్రచార ఖర్చులు 1.4 బిలియన్ డాలర్లు తగ్గాయని తెలిసింది. ప్రయాణం, వినోద ఖర్చుల రూపంలో 371 మిలియన్ డాలర్లు తగ్గాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా సంస్థలో మార్కెటింగ్, పరిపాలనా ఖర్చులు నామమాత్రంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మెయింటెనెన్స్ ఖర్చులు సంస్థకు చాలా వరకూ తగ్గిపోయాయి. దాంతో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పెద్ద కంపెనీలకు బాగానే కలిసొచ్చింది.
Also read: Twitter Features: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్, ఇకనుంచి నగదు సంపాదించుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook