వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గూగుల్, వేతనంలో కోత

Work from Home: కరోనా మహమ్మారి నేపధ్యంలో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పెరిగింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనికి మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో గూగుల్ సంస్థ మాత్రం వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2021, 11:03 AM IST
వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గూగుల్, వేతనంలో కోత

Work from Home: కరోనా మహమ్మారి నేపధ్యంలో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పెరిగింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనికి మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో గూగుల్ సంస్థ మాత్రం వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది.

కరోనా సంక్షోభం(Corona Crisis) నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇంటి నుంచే పని కొనసాగిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటి నుంచి పనిచేసే ఇలాంటి ఉద్యోగుల వేతనంలో కొంత మొత్తం కట్ చేసే అవకాశముందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ముఖ్యంగా గూగుల్ (Google)సంస్థకు ఇలాంటి ఆలోచన ఉన్నట్టు సమాచారం. గూగుల్ ఉద్యోగులు భవిష్యత్‌లో శాశ్వతంగా ఇంటి నుంచి పని (Work from home)చేయడానికి మారితే..వేతనంలో కోతలు విధించే అవకాశముందని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. సిలికాన్ వ్యాలీలో ఇప్పుడీ విషయంపైనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంతాల్నించి రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల జీతాన్ని తగ్గించాయి.

ఆల్భాబెట్ ఇంక్ గూగుల్(Google)..ఉద్యోగులు నివాసముంటున్న లొకేషన్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సంస్థ కూడా ఉద్యోగుల లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎప్పుడూ వారి స్థానం ఆధారంగా ఉంటాయి. ఓ ఉద్యోగి ఎక్కడి నుంచి పనిచేస్తాడనేదాని ఆధారంగానే స్థానిక మార్కెట్ కంటే ఎక్కువగా చెల్లింపు ఉంటుందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వేతనం ఎప్పుడూ ఓ నగరం నుంచి మరో నగరానికి, ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. జూన్ నెలలో ప్రారంభించిన కంపెనీ వర్క్ లొకేషన్ టూల్(Work location tool) ఆధారంగా కనీసం 10 నుంచి 20 శాతం వరకూ కోత విదించవచ్చని తెలుస్తోంది. 

Also read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News