Father's Day 2023 Gift Ideas: మీ ప్రియమైన డాడీని సర్‌ప్రైజ్ చేయండిలా!

Father's Day 2023 Gift Ideas: ఫాదర్స్ డే అనగానే ఎన్నో ఎమోషన్స్.. నా కోసం ఎంతో చేసిన నాన్న కోసం ఏదో ఒకటి చేయాలనే తపన.. తన కోసం అంటూ ఏమీ చూసుకోకుండా కుటుంబం కోసమే 24 గంటలు శ్రమించిన నాన్న కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన.. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా ? అయితే ఇదిగో ఈ సింపుల్ గిఫ్ట్ ఐడియాలు మీ కోసమే..

Written by - Pavan | Last Updated : Jun 19, 2023, 07:32 PM IST
Father's Day 2023 Gift Ideas: మీ ప్రియమైన డాడీని సర్‌ప్రైజ్ చేయండిలా!

Father's Day 2023 Gift Ideas: మన జీవితం కోసం అహర్నిశలు శ్రమించిన నాన్నను గౌరవించడానికి, అభినందించడానికి ఏడాదికొకసారి ఒక ప్రత్యేకమైన సందర్భంతో పనిలేదు.. పిల్లల కోసం సంవత్సరానికి ఒక్క రోజే అని కాకుండా తన జీనితాన్నే ధారపోసిన నాన్న కోసం పిల్లలు కూడా అలాగే తమ జీవితాంతం నాన్న పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చూపించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సంవత్సరానికి ఒక్క రోజు అని కాకుండా.. సంవత్సరం పొడవునా నాన్నను ప్రేమించుకోవచ్చు.. గౌరవించుకోవచ్చు.. 

కానీ కుటుంబం కోసం నాన్న బిజీ నాన్నది.. చదువులో, ఉద్యోగ ధర్మంలో పడి కొట్టుకుపోతున్న పిల్లల బిజీ పిల్లలకు ఉంది. అందుకే జీవితకాలం పాటు నాన్న పడిన కష్టాన్ని తుడిచేసేలా సంవత్సరానికి ఒకసారైనా నాన్న కోసం కేటాయించిందే ఈ ఫాదర్స్ డే. ఈ సంవత్సం ఫాదర్స్ డే రేపే.. అంటే జూన్ 18న జరుపోకోబోతున్నాం. మరి నాన్నను సర్ ప్రైజ్ చేయడం కోసం ఏ గిఫ్ట్ కొంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా ? అరెరె.. మన వద్ద ఎక్కువ బడ్జెట్ లేదే.. అని దిగాలు పడుతున్నారా ? డోంట్ వర్రీ ఇదిగో ఈ సింపుల్ గిఫ్ట్స్ ఐడియాలు మీకోసమే. 

పర్సనల్ ఫోటోలతో కస్టమైజ్డ్ కొలేజ్:
నాన్న పర్సనల్ ఫోటోలు, నాన్నతో కలిసి తీసుకున్న ఫోటోలు, కుటుంబంతో కలిసి నాన్న గడిపిన క్షణాలు, అమ్మ-నాన్నలకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫోటోలను సేకరించి, ఒక సింగిల్ ఫోటో కోల్లెజ్ గా డిజైన్ చేయండి. ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు.. ఆన్ లైన్లో ఇందుకోసం ఎన్నో ప్లాట్ ఫామ్స్ రెడీగా ఉన్నాయి. లేదంటే మీ వీధిలో ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్లినా పని అయిపోతుంది. పైగా దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. కానీ నాన్నకు మాత్రం ఎప్పటికీ మీ బహుమతి గుర్తుండిపోతుంది.

ఇది కూడా చదవండి: 7th Pay Commission updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి మరో 4 శాతం పెరగనున్న డీఏ

కస్టమైజ్డ్ కూపన్ బుక్ :
ఒకప్పుడు గిఫ్ట్ కూపన్స్ అంటే ఏదో ఒక సంస్థ మనకు బహుమతిగా ఇచ్చేవి.. కానీ ఇప్పుడు అలా కాదు.. మీ అవసరాలకు అనుగుణంగా మీరే కూపన్స్ డిజైన్ చేయింకుని మీకు కావాల్సిన వారికి బహుమతిగా ఇవ్వొచ్చు. మీ నాన్న వ్యక్తిగత అవసరాలు ఏంటో మీకంటే బాగా మరెవ్వరికీ తెలియదు. అందుకే నాన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని గిఫ్ట్ కూపన్స్ రెడీ చేయించండి. ఇందుకోసం యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు బ్యాంకులు కూడా మీకు కస్టమైజ్డ్ గిఫ్ట్ కూపన్స్ ఇచ్చేందుకు సహాయం చేస్తాయి. మీరు గిఫ్టుగా ఇచ్చిన కూపన్స్‌ని తనదైన అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రతీసారి మీ నాన్న కళ్లలో మీరు మెదలకపోతే నన్ను అడగండి.

నాన్న కోసం కిచెన్‌లో కుస్తీలు :
నాన్న కోసం డబ్బులు పెట్టి బహుమతులు కొనివ్వడం ఒక స్టైల్ అయితే... నాన్న కోసం స్వయంగా వంట గదిలో దూరి నాన్నకు ఇష్టమైన రెసిపీలు రుచికరంగా చేసి వడ్డించడం మరో స్టైల్. కుటుంబం కోసం ఎన్నో చేసే నాన్న.. కుటుంబం నుంచి ఏమీ కోరుకోడు.. ఒక్క ప్రేమను తప్ప. అందుకే నాన్నపై మీకున్న ప్రేమను నాన్నకు ఇష్టమైన వంటల రూపంలో వడ్డివార్చి నాన్న ముఖంలో ఉప్పొంగే ఆనందాన్ని చూడండి.. ఆ క్షణం ముందు ఒక్కోసారి డబ్బులు పెట్టి కొనిచ్చిన గిఫ్టులు కూడా పనికిరావేమో అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి.

మెమరీ జార్ :
చిన్నప్పడు నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకున్నప్పటి నుంచి.. కాలుకు బూట్లు తొడిగి, మెడకు టై చుట్టి స్కూల్ కి తీసుకెళ్లడం వరకు.. ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించినప్పటి నుంచి.. కాన్వకేషన్ లో పట్టా అందుకునే వరకు.. మీ నాన్నతో గడిపిన ఎన్నో మధురమైన క్షణాలు మీకు ఎప్పటికీ గుర్తుండే ఉంటాయి. నాన్నా.. నీతో గడిపిన ప్రతీక్షణం నాకు గుర్తుంది.. నాకోసం నువ్వు పడిన ప్రతీ కష్టం నాకు గుర్తుంది అని గుర్తుచేస్తూ ఆ మధురానుభూతులను ఒక్కో చీటిపై రాసి ఒక గ్లాస్ జార్‌లో వేసి బహుమతిగా అందివ్వండి. అవి చదువుతున్నప్పుడు ఒక్కోసారి నాన్న పెదాలపై చిరునవ్వు.. ఒక్కోసారి నాన్న కళ్లలో చెప్పలేని భావాలు కనిపించకుంటే అడగండి.

ఇది కూడా చదవండి: 5G Phones Under Rs. 20K: రూ. 15 వేల నుంచి 20 వేల మధ్య చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్

అవుట్‌డోర్ అడ్వెంచర్స్ :
మీ కోసం కష్టపడిన నాన్నకు వయసైపోవచ్చేమో కానీ.. మీ కుర్రతనంలో మీతో గడిపిన మధురానుభూతులు, మీతో కలిసి ఆడుకున్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోడు. అందుకే వీలైతే నాన్నతో పాటు మొత్తం కుటుంబంతో ఎక్కడైనా ఔట్ డోర్ గేమ్స్ కి ప్లాన్ చేయండి. నాన్న సై అంటే.. దేనికైనా రెడీ అన్నట్టుగా ట్రెక్కింగ్, స్విమ్మింగ్, క్రికెట్.. లేదా నాన్నకు ఇష్టమైన ఏదైనా ఆటను ప్లాన్ చేసి మళ్లీ నాన్నను తన చిన్నతనంలోకి తీసుకెళ్లండి.

బాల్యమిత్రులతో సడెన్ సర్‌ప్రైజ్.. 
నాన్న మన చిన్నతనంలో మనకెన్నో ఆట వస్తువులు కొనిచ్చి సడెన్ సర్‌ప్రైజ్‌లు ఇచ్చుంటాడు కదా.. మనకి చెప్పకుండా మనల్ని సినిమాలు, షికార్లకు తీసుకుని వెళ్లి ఉండుంటాడు కదా.. మీరు కూడా అలాగే మీ నాన్న చిన్ననాటి బాల్యమిత్రులను మీ ఇంటికి ఆహ్వానించి వారిని అంతా ఒక్కచోట కలిసేలా ప్లాన్ చేయండి. బట్ వన్ కండిషన్.. ఫాదర్స్ డే నాడు మరో ఫాదర్‌ని కానీ లేదా వారి పిల్లలను కానీ డిస్టర్బ్ చేయకుండా.. ఫాదర్స్ డే సందర్భంగా ఏదైనా ఒక రోజు వీలు చూసుకుని ఈ పని చేయండి. అప్పుడు వచ్చే వారికి కూడా ఇబ్బంది ఉండదు.. చిన్ననాటి బాల్యమిత్రులతో మీ నాన్న గడుపుతున్న క్షణాలను మీరు పదిలంగా కెమెరాలో బంధించగలిగితే.. అది ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమానం అవుతుంది. ఈ గిఫ్ట్ ఐడియాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వెల్లడించండి.

ఇది కూడా చదవండి: Smartphones Under Rs 20K: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News