Car Crash Caught On Camera: ఢిల్లీలో సీఆర్ పార్క్ ప్రాంతంలో అతి వేగంతో దూసుకొచ్చిన కారు కారణంగా ఏర్పడిన పెను ప్రమాదంలో నలుగురు మైనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన CCTV కెమెరాలో రికార్డు అయింది, రికార్డ్ అయిన వీడియో ప్రకారం మారుతి సుజుకి బాలెనో పక్కనే ఉన్న ఒక స్విఫ్ట్ డిజైర్‌ను ఢీకొట్టడం వలన ప్రమాదం ఏర్పడింది. కారు క్రాష్ అవడానికి ముందు కొన్ని పల్టీలు కొట్టడం కూడా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు పలు ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తోంది. ఇక ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియ రాలేదు.
మీడియా నివేదికల ప్రకారం, ఈ కారు ప్రమాదం CR పార్క్‌లోని ఆరావళి అపార్ట్‌మెంట్ ముందు జరిగింది. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బాలెనో కారు అతి వేగంతో వస్తోంది. ఆరావళి అపార్ట్‌మెంట్ సమీపంలోకి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండడంతో డివైడర్‌ను ఢీకొట్టడంతో గాలిలోకి లేచింది. దీని తర్వాత పలుమార్లు బోల్తా పడడంతో ట్యాక్సీ చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారు చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే గందరగోళం నెలకొంది.
दिल्ली के CR Park में पलटी कार#delhi #viral #socialmedia #ZeeSalaamVideo pic.twitter.com/nR5lLknSIT
— Zee Salaam (@zeesalaamtweet) March 28, 2023
అదే సమయంలో అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులను బయటకు లాగి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదంపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. ప్రమాద సమయంలో కారు వేగం 100కు పైగా ఉందని అక్కడున్న వారు తెలిపారు. అయితే ఇంత ఘోర ప్రమాదం జరిగినా ఒక్క రైడర్ కూడా తీవ్రంగా గాయపడకపోవడం విశేషం.
ఢిల్లీ పోలీసులు ప్రకారం, కారు డ్రైవర్ 17 ఏళ్ల మైనర్, అమో కల్కా జీ నివాసి, అని మిగిలిన ప్రయాణికులు కూడా మైనర్లే అని వారందరూ స్నేహితులు అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో ఉన్న కారు పరిస్థితిని చూస్తే ప్రమాద సమయంలో కారు వేగం ఎంత ఎక్కువగా ఉంటుందో అంచనా వేయవచ్చు.
Also Read: Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్
Also Read: Shaakuntalam 3D Trailer: విజువల్ వండర్లా శాకుంతలం.. 3D ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి