How Did Diamond Come To Earthsiege: వజ్రాలను మనం తరచుగా ఎక్కడో ఒక చోట చూస్తూ ఉంటాం. వీటి విలువ బంగారం కంటే ఎక్కువ అని అందరికీ తెలిసిందే. అయితే అందరికీ సందేహం కలుగవచ్చు. ఇవి ఎలా తయారవుతాయి..వీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారని..అయితే మేము ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియజేయబోతున్నాం. మీ మదిలో మెదిలే వజ్రాలకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు మేము సమాధానాలు అందిచబోతున్నాం.
వజ్రాలు ఎంతో దృఢమైనవని అందరికీ తెలిసిందే..వీటిని మీరు పెద్ద సుత్తితో పగలగొట్టాలని చూసిన అవి పగలవు. ఎందుకంటే ఇవి అపారమైన పీడనంతో పాటు ఒత్తిడి వల్ల తయారవుతాయి. అంతేకాకుండా ఇవి భూమి బరువు కూడా భరించగలవని నిపుణులు చెబుతున్నారు. ఒక రాయి అరుదైన వజ్రంలా తయారు కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. మొదటగా ఈ వజ్రాలు భూమిలోని 170 కిలోమీటర్ల లోపల ఏర్పడతాయి. ఆ తర్వాత అగ్ని పర్వాతాలు బద్ధలయ్యే క్రమంలో బయటికి వస్తాయని, దీనికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
అయితే వజ్రాలు భూమి మీదికి రావడానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ అధ్యయనాల ప్రకారం..బద్ధలైన అగ్ని పర్వాతాల నుంచి లావా లాగా బయటికి వస్తాయి. ఆ తర్వాత ఈ వజ్రాలు భూమి నుంచి ఆకాశానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి..ఇలా కాలక్రమేనా భూమి పై పొరలలోకి చేరుకుని భూమిపై పడతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అరుదైన వజ్రాలు తయారు కావడానికి మరింత ప్రాసెస్ ఉంటుందట.
వజ్రం పూర్తిగా తయారు కావడానికి కొన్ని మందల కిలో మిటర్ల భూమి లోపల నుంచి బయటకి రావాల్సి ఉంటుంది. వజ్రాన్ని పైనకి నెట్టేందుకు సరైన శక్తి ఎంతో అవసరం..ఇవి పైకి రావడానికి సరైన శక్తితో పాటు వాతావరణం కూడా అనుకూలించాల్సి ఉంటుంది. అయితే ఇదే అంశంపై శాస్త్రవేత్తల టీమ్ కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధలు జరుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో వారు ఖంగాల చరిత్రను కదిలించారు. ఇందులో భాగంగా కొన్ని వందల ఏళ్ల క్రితం భూమిపై ఖండాలు వేరు వేరుగా చీలిపోయాయి. ఇదే క్రమంలో అగ్నిపర్వతాల్లో భారీ పేలుళ్లు సంభవించి వజ్రాలను పట్టుకుని ఉన్న కింబర్‌లైట్స్ రాళ్లు భూమిపై పడ్డాయి. ఇక కాలక్రమేనా వ్రజాలు భూమిపై కనిపించడం మొదలయ్యాయని పరిశోధనలు చెబుతున్నాయ.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి