Viral News: ఇంగ్లీషులో 35, మ్యాథ్స్‌లో 36 మార్కులు.. ఆ ఐఏఎస్ అధికారి పదో తరగతి మార్క్స్ షీట్ వైరల్..

ఓ ఐఏఎస్ అధికారి పదో తరగతి మార్క్స్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఐఏఎస్ అధికారికి పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ వంటి కీలక సబ్జెక్టుల్లో కేవలం పాస్ మార్కులే వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 11:49 AM IST
  • సోషల్ మీడియాలో ఐఏఎస్ అధికారి పదో తరగతి మార్క్స్ షీట్
  • ఇంగ్లీషులో కేవలం 35, మ్యాథమేటిక్స్‌లో 36, సైన్సులో 38
  • పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన కుంగిపోవద్దని చెబుతోన్న ఐఏఎస్
Viral News: ఇంగ్లీషులో 35, మ్యాథ్స్‌లో 36 మార్కులు..  ఆ ఐఏఎస్ అధికారి పదో తరగతి మార్క్స్ షీట్ వైరల్..

IAS 10th Marks Sheet Gone Viral: పరీక్షలనగానే విద్యార్థుల్లో భయం, ఆందోళన, ఒత్తిడి మొదలవుతుంది. పరీక్షా ఫలితాలు వెలువడే రోజు  టెన్షన్ పీక్స్‌కి చేరుతుంది.పరీక్షల్లో తాము అనకున్న దాని కన్నా ఏమాత్రం తక్కువ మార్కులు వచ్చినా ఇట్టే ఢీలా పడిపోతారు. మానసికంగా కుంగిపోతారు. కొంతమంది బలవన్మరణాలకు సైతం వెనుకాడరు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే సమయం. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఓ ఐఏఎస్ అధికారి మరో ఐఏఎస్ అధికారికి చెందిన పదో తరగతి మార్క్స్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రానా.. ఇక ఏమీ చేయలేమనే నిరాశ,నిస్పృహ ధోరణి సరికాదని చెప్పేందుకే మార్క్స్ షీట్‌ను షేర్ చేశారు.

ఆ మార్క్స్ షీట్‌ ప్రస్తుతం గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న తుషార్ డి సుమేరాకు చెందినది. మొదట శైలేష్ సగ్పారియా అనే మోటివేటర్ ఆయన మార్క్స్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపై ఛత్తీస్‌గఢ్ కేడర్‌కి చెందిన అవనీష్ శరణ్ కూడా ఆ మార్క్స్ షీట్‌ను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ మార్క్స్ షీట్‌ను గమనిస్తే.. పదో తరగతిలో తుషార్ డి సుమేరాకు ఇంగ్లీషులో కేవలం 35, మ్యాథమేటిక్స్‌లో 36, సైన్సులో 38 మార్కులు వచ్చాయి. అంటే.. కేవలం పాస్ మార్కులు అన్నమాట. ఆ మార్కులు చూసి.. సుమేరాతో ఇక ఏదీ కాదని, అతనేమీ చేయలేడని గ్రామస్తులు, స్కూల్లో వారు తేల్చేశారు. కానీ అదే సుమేరా 2012లో యూపీఎస్సీ క్లియర్ చేసి ఐఏఎస్‌ అయ్యారు.

పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఆ తర్వాత కష్టపడి చదివి ఇంగ్లీష్, మ్యాథ్స్ నేర్చుకున్నట్లు సుమేరా తెలిపారు. పరీక్షా ఫలితాల సమయంలో సగ్పారియా విద్యార్థులకు తననొక ఉదాహరణగా చెబుతుంటాడని పేర్కొన్నారు. ఈసారి తన మార్క్స్ షీట్‌ ఫోటో తీసి పంపించమని అడిగాడన్నారు. తాను ఫోటో తీసి పంపించడంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పారు. ఇప్పుడా మార్క్స్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడేవారు.. అక్కడితోనే అంతా ముగిసిపోదని.. ఐఏఎస్ సుమేరా మార్క్స్ షీట్ చూసైనా ఈ విషయాన్ని గ్రహించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: CM KCR: కేసీఆర్ షాకింగ్ న్యూస్... మమత మీటింగ్ కు డుమ్మా!

 

Also Read: Mega Recruitment: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే  ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News