Google Meet: గూగుల్ మీట్స్ వాడుతున్నారా ? ఇది చదవండి

గూగుల్ ( Google ) తన వీడియో కాన్ఫెరెన్సింగ్ యాప్ అయిన గూగుల్ మీట్ లో కీలకమైన మార్పులు చేసింది. 

Last Updated : Sep 29, 2020, 07:00 PM IST
    • గూగుల్ తన వీడియో కాన్ఫెరెన్సింగ్ యాప్ అయిన గూగుల్ మీట్ లో కీలకమైన మార్పులు చేసింది.
    • 60 నిమిషాల కన్నా ఎక్కువగా మీటింగ్ నిర్వహించే వెసులుబాటును తొలగించింది.
    • దాంతో పాటు ఫ్రీ వెర్షన్ లోని కొన్ని అడ్వాన్సెడ్ జీ సూట్ ఫీచర్స్ కు యాక్సెస్ పై కొన్ని పరిమితులు విధించింది.
Google Meet: గూగుల్ మీట్స్ వాడుతున్నారా ? ఇది చదవండి

గూగుల్ ( Google ) తన వీడియో కాన్ఫెరెన్సింగ్ యాప్ అయిన గూగుల్ మీట్ లో కీలకమైన మార్పులు చేసింది. 60 నిమిషాల కన్నా ఎక్కువగా మీటింగ్ నిర్వహించే వెసులుబాటును తొలగించింది. దాంతో పాటు ఫ్రీ వెర్షన్ లోని కొన్ని అడ్వాన్సెడ్ జీ సూట్ ఫీచర్స్ కు ( G-Suite ) యాక్సెస్ పై కొన్ని పరిమితులు విధించింది. ఈ కొత్త నియమాలు సెప్టెంబర్ 30 నుంచి అమలులోకి రానున్నాయి. మీటింగ్ సమయంలో మార్పుతో పాటు మరికొన్ని ఫీచర్స్ లో కుదింపులు చేయనుంది. 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

గూగుల్ డ్రైవ్ లో సేవింగ్...
250 మంది కన్నా ఎక్కువ మందికన్నా ఎక్కువ మంది మీటింగ్ ను ఒకేసారి అటెంట్ అవ్వలేరు. లైవ్ స్ట్రీమింగ్ తో పాటు మీటింగ్ రికార్ట్స్ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేయడం ( Google Drive ) వంటి విషయంలో కూడా పలు మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

దీనిపై స్పందించిన గూగుల్ సంస్థ  "ప్రోమో, అడ్వాన్సెడ్ ఫీచర్ల గడువు ముగింపు విషయంలో చెప్పడానికి ఏమీ లేదు.. ఏవైనా ఉంటే తప్పకుండా చెబుతాం" అని తెలిపింది.

ఫ్రీవర్షన్ యూజర్లకు
అయితే ఫ్రీ వర్షెన్ ను వినియోగిస్తున్న యూజర్లు లిమిటెడ్ ఫీచర్స్ తో గూగుల్ మీటింగ్స్ ను కొనసాగించవచ్చు. మీటింగ్ లో 60 నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించే అవసరం లేదు అనుకున్న వారు లిమిటెడ్ ఫీచర్స్ తో కొనసాగవచ్చు.

ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

పెరిగిన డైలీ యూజర్స్
కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో జూమ్ యాప్స్ తోపాటు చాలా మంది గూగుల్ మీట్స్ ను వినియోగించారు. ఫ్రీ వర్షన్ ను వాడే వారు కేవలం కొన్ని ఫీచర్స్ తో కొనసాగారు. గూగుల్ మీట్, జూమ్ యాప్ ల రోజువారీ వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ మార్క్ ను దాటారు. 

ఇంతకు ముందే తన మీట్ యాప్ లో 49 మందిని ఒకేసారి చూసే అవకాశాన్ని కల్పించింది గూగుల్. ఈ 49 మందిని స్క్రీన్ పై టైల్డ్ లేదా ఆటో లే అవుట్ ఫార్మెట్ లో చూడవచ్చు. అయితే  ఈ ఫీచర్ కేవలం వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x