King Cobra Vs Comodo Dragong Fight Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే చాలా వరకు వీడియోల్లో వన్యప్రాణులకు సంబంధించిన దృశ్యాలు ఎక్కువగా ఉండడం విశేషం. ఇలాంటి వీడియోలు కొందరినీ బయపెడుతుంటే.. మరి కొందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చాలా మంది వన్యప్రాణుల వీడియోలు సినిమాల్లోనే చూడొచ్చు. కానీ ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియోలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అయ్యే వీడియో ఎంటో, అసలు ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎందుకు ఆశ్చర్యానికి గురివుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం నెట్టింట ఎక్కువగా వైరల్‌గా మారిన వీడియోల్లో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటే.. ఇటివలే మనం కొమాడో డ్రాగన్‌కు సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే మీరు ఈ వీడియో చూస్తే ఆశ్చర్యానికి గురి కావొచ్చు. అవును కొమోడో డ్రాగన్, కింగ్ కోబ్రాలు రెండు దాడికి దిగాయి. అయితే ఇవి రెండు ఎంతో శక్తిని కలిగి ఉన్న కోబ్రాలు తన పళ్లతో డ్రాగన్ ఓడించేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అప్పుడు కొమోడో డ్రాగన్ పాము నుంచి రక్షణ పొందేందుకు రోడ్డుపై పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ పాము వదిలిపెట్టదు..
అయితే మీరు ఈ వీడియోలే గమనిస్తే కింగ్ కోబ్రా కదలకుండా తన పళ్లతో కొమోడో డ్రాగన్‌ను పట్టేసింది. దీంతో ఈ డ్రాన్ ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది. అయితే చివరకు డ్రాగన్ పాము నుంచి తప్పికుని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కింగ్ కోబ్రా దాదాని కాటేయ్యడంతో వెళ్లినట్లే వెళ్లి దొరికి పోతుంది. పాము, డ్రాగన్ రెండు కెమెరా వైపు రావడంతో వీడియోను అక్కడికే ఆపేశారు. అయితే చివరికి ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.
ఈ వీడియో ను Latest Sightings అనే యూట్యుబ్ చానెల్ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు మీరు కొమోడో డ్రాగన్ సంబంధించిన వీడియోలను లక్షలాది చూసి ఉంటారు. కానీ ఇది అన్నింటి కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పటి ఈ వీడియోను 40 లక్షలకు పైగా వీక్షించగా.. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సన్నివేశాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.