Snake Catcher Mirza MD Arif release 16 feet King Cobra in Odisha Forest: ఒకప్పుడు ఇంట్లో పాములు దూరితే.. పొగ పెట్టి మరీ ఇంటి నుంచి తరిమేసే వారు. పొగ కారణంగా పాములకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి.. రంద్రం నుంచి బయటకి రావడం లేదా ఇంట్లో నుంచి పారిపోతాయి. పాములను పట్టేందుకు లేదా చంపేందుకు కొన్ని ప్రత్యేక పనిముట్లను కూడా వాడేవారు. ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పాములు దూరితే వాటిని పట్టేందుకు ఎంతో అనుభవమున్న స్నేక్ క్యాచర్‌లను పిలుస్తున్నారు. వారు పాములను చాలా సులువుగా పెట్టేస్తున్నారు. అయితే కొన్ని పాములు వారికి కూడా చుక్కలు చూపిస్తున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ ఒడిశాలో చాలా ఫేమస్. ఎంత పెద్ద విషసర్పాలను అయినా చాలా సునాయాసంగా పట్టుకుంటాడు. అది కింగ్ కోబ్రా అయినా 'తగ్గేదేలే' అంటాడు. ఎలాంటి పరికరాల సాయం లేకుండా.. ఒట్టిచేతులతోనే ఈజీగా పట్టుకుంటాడు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ పరిసర ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. 16 అడుగుల కింగ్ కోబ్రాను కూడా చాలా సులువుగా పట్టుకునాడు. ఇందుకు సంబందించిన వీడియోను స్నేక్ క్యాచర్ ఆరిఫ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ (MIRZA MD ARIF)లో పోస్ట్ చేశాడు.
మీర్జా ఎండీ ఆరిఫ్ 16 అడుగుల నల్ల కింగ్ కోబ్రాను బాలాసోర్ పరిసర ప్రాంతంలో పట్టుకున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ల సాయంతో ఆ పామును బాలాసోర్ అడవుల్లో వదలడానికి రాత్రి వేల వెళతాడు. సంచిలోంచి బయటికి రాగానే ఆరిఫ్‌ను కాటేయడానికి కోబ్రా దూసుకొస్తోంది. మధ్య చెట్టు ఉండడంతో అది వెనక్కి తగ్గుతుంది. అనంతరం మరోసారి కాటేయడానికి రాగా మొట్టు తాకి పాము పక్కకు పోతుంది. చాలాసార్లు ఇలా జరిగినా ఆరిఫ్ చాకచక్యంగా తపించుకుంటాడు. స్నేక్ క్యాచర్ ఆరిఫ్ ఈ కింగ్ కోబ్రాను 2020 అక్టోబర్ మాసంలో పట్టుకునాడు. ఈ వీడియోను ఆరిఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోకు 2,299,883 వ్యూస్ వచ్చాయి.
Also Read: రేపే భారత్ vs ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
Also Read: యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.