Viral News: 300కిలో మీటర్లకు పైగా బైక్ పై ప్రయాణం చేసి అసెంబ్లీకి వచ్చిన నూతన ఎమ్మెల్యే..

Mla Travels 330 Km Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యక్తి దాదాపు 300 పైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి అసెంబ్లీకి చేరుకొని తన ధ్రువపత్రాలను సమర్పించారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు అయితే ఈ ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 09:03 AM IST
 Viral News: 300కిలో మీటర్లకు పైగా బైక్ పై ప్రయాణం చేసి అసెంబ్లీకి వచ్చిన నూతన ఎమ్మెల్యే..

Mla Travels 330 Km Viral News: కొందరు నాయకులు ప్రజా సేవే లక్ష్యంగా సాధారణ జీవితం గడుపుతూ ప్రజల కష్టాసుకాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు నాయకులయితే ప్రజల నుంచే దోచుకుని లగ్జరీ జీవితాలను గడుపుతారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఎంతో నిజాయితీగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజల కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా ఇలాంటి నాయకులకు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఇటీవలే ఇలాంటి నాయకుడికి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో.. ఆ నాయకుడు చేసిన పని ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నియోజకవర్గంలో కమలేశ్వర్ అనే వ్యక్తి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తన ధ్రువపత్రాలను సమర్పించేందుకు దాదాపు 330 కిలోమీటర్ల వరకు బైక్ పై ప్రయాణం చేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తనకు ఇంతవరకు సొంత కారు, బైక్ లేదని తెలిపారు.  తన బంధువులకు సంబంధించిన ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని ప్రయాణం చేశారన్నారు. ఆయన సొంత స్థలం రాత్రి జిల్లా సైనాల నుంచి భోపాల్ వరకు 300 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కమలేశ్వర్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించగా.. ఎంతో కష్టపడి లా పూర్తి చేశారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని తెలిపారు. ఆయన భారతీయ ఆదివాసీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్లోని ఈ పార్టీ నుంచి గెలిచిన మొదటి ఏకైక అభ్యర్థిని కమలేశ్వర్ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని తనను గెలిపించడానికి కార్యకర్తలు కూడా ఎంతో సహాయం చేశారని తెలిపారు. అంతేకాకుండా ప్రజల సమస్యలపై పోరాడి, వారి కష్టసుఖాలను పంచుకుంటానన్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News