Man rescued leopard video viral: సాధారణంగా అడవికి దగ్గరలో ఉండే గ్రామాల్లో తరచుగా క్రూర జంతువులు సంచరిస్తుంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, ఎలుగు బంట్లు, పాములు మన ఇళ్లదగ్గరకు తరచుగా వస్తుంటాయి. ఈ క్రమంలో అవి మనుషుల మీదకు దాడిచేసి ప్రాణాలు సైతం తీస్తుంటాయి. కొన్నిసందర్భాలలో ఆ జంతువులు మనుషుల చేతుల్లో చనిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అడవిలోని జంతువులు ఇటీవల గ్రామాల్లోకి, రోడ్ల మీదకు వస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇది ఇంట్లో ఉండే సాధుజంతువులు ఆవులు, మేకల్ని ఎత్తుకుని పోయి తినేస్తుంటాయి.
Indeed, a filmy capture of a leopard in Karnataka. pic.twitter.com/0tKtRqKlFF
— Ajay Kumar (@ajay_kumar31) January 7, 2025
అదే విధంగా అడవి లోని జంతువులు రాత్రి పూట వేటను సాగిస్తుంటాయి. ఈ వేటలో కొన్నిసార్లు పెంపుడు జంతువులైన కుక్కల్నికూడా .. చిరుత పులులు వేటాడిన ఘటనలు అనేక సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. తాజాగా కర్ణాటకలోని రంగపుర గ్రామంలో ఒక చిరుత హల్ చల్ చేసింది. కొన్ని రోజులుగా గ్రామస్థులకు కంటి మీద కునుకులేకుండా చేసినట్లు తెలుస్తొంది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఫారెస్ట్ సిబ్బంది పెద్ద వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలుచూపించింది. దొరికినట్లు దొరికి.. ఇట్టేపారిపోయింది. చివరకు.. ఒకఇంట్లో చిరుతనక్కడంతో అక్కడికి పారెస్ట్ సిబ్బందిచేరుకున్నారు. వెంటనే వలలతో అక్కడకు వెళ్లి దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. ఇంతలో చిరుత ఒక్కసారిగా అక్కడున్నవారి మీద దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది.
అక్కడున్న వారంతా..దూరంగా వెళ్లిపోతుండగా..ఒక వ్యక్తి మాత్రం వట్టి చేతులతో చిరుతను బంధించాడు. అదేదో.. మేకను తోక పట్టుకుని లాగినట్లు చిరుత తోకను పట్టుకుని కదలకుండా బంధించాడు. అధికారులు దానిమీద వలవేసి చిరుతను మొత్తానికి బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతగాడి ధైర్యానికి మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter