Top 10 topics searched on google in 2021: ప్రస్తుత '2021'కి గుడ్ బై చెప్పి నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ఏడాది ముగింపు వేళ ఈ సంవత్సర కాలంలో జరిగిన మంచి, చెడులను గుర్తుచేసుకోవడం సహజం. అలాగే, ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 10 ట్రెండింగ్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం...
Australia vs India : ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిల్లో 'ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా' టాపిక్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే నంబర్ వన్ ట్రెండింగ్‌గా నిలిచింది.
India vs England : ఈ ఏడాది గూగుల్ ట్రెండింగ్ లిస్టు టాప్-2లో 'ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్' టాపిక్ నిలిచింది.
Indian Premier League : గూగుల్ ట్రెండింగ్ లిస్టులో 'ఐపీఎల్' టాప్-3లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఐపీఎల్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు.
National Basketball Association : గూగుల్ టాప్ ట్రెండింగ్ లిస్టులో 'ఎన్‌బీఏ' (National Basketball Association) టాప్-4 స్థానంలో ఉంది.
Euro 2021 : క్రికెట్, బాస్కెట్‌బాల్ తర్వాత గూగుల్‌లో అత్యధికమంది సెర్చ్ చేసింది 'ఫుట్‌బాల్' టాపిక్. యూరో 2021 గూగుల్ ట్రెండింగ్‌లో ఐదో స్థానంలో నిలిచింది.
Copa América
సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 'కోపా అమెరికా' గూగుల్ ట్రెండింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది.
India vs New Zealand
గూగుల్ ట్రెండింగ్స్‌లో ఏడో స్థానంలో 'ఇండియా వర్సెస్ న్యూజిలాండ్' టాపిక్ ఉంది.
T20 World Cup
టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది గూగుల్ టాప్ సెర్చ్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Squid Game
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ఈ ఏడాది గూగుల్ ట్రెండ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Rapper DMX
పాపులర్ ర్యాపర్ డీఎంఎక్స్ (50) ఈ ఏడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. డీఎంక్స్ టాపిక్ ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లిస్టులో 10 స్థానంలో ఉంది.
Also Read: IND Vs SA: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు... గతంలో ఏ కెప్టెన్‌కి సాధ్యం కానిది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook