Trump Pakistani Daughter: అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాదించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లో కూడా రక్త సంబంధీకులున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ట్రంప్ ఓ వైపు విజయం ఆస్వాదిస్తుంటే మరోవైపు నేను మీ కూతుర్ని అంటూ పాకిస్తాన్ నుంచి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజంగా ఈమె ట్రంప్ కూతురా కాదా అనేది పక్కన బెడితే వీడియోని జనం బాగా వీక్షిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో ఓ కూతురు ఉంది. ఆశ్చర్యపోతున్నారా..ఈ వీడియో చూస్తే అదే అన్పిస్తుంది మరి. వాస్తవానికి ఈ వీడియో పాతదే. కానీ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాత వీడియో గట్టిగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బురఖా ధరించిన ఓ అమ్మాయి ట్రంప్ తన తండ్రి అని స్పష్టంగా గట్టిగా చెబుతోంది. తొలిసారి ఈ వీడియో 2018లో పోస్ట్ అయింది. అప్పట్లో ఎవరూ ఎందుకో మరి పట్టించుకోలేదు. కానీ ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం తరువాత చాలామంది ఈ వీడియోను రీ పోస్ట్ చేశారు. దాదాపు అన్నీ వైరల్ అవుతున్నాయి. ఎక్స్‌లో ఓ పాకిస్తానీ ఎక్కౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను ఏకంగా 5.5 లక్షలమంది చూశారు. తాను ముస్లిం అంటూ ఉర్దూలో చెప్పుకొచ్చిన ఈ అమ్మాయి..డోనాల్డ్ ట్రంప్ తన తండ్రి అని ఘంటాపధంగా చెబుతోంది. అంతేకాకుండా తన తల్లిని ట్రంప్ బాధ్యతలేని వ్యక్తిగా భావించారని, కుమార్తెను అంటే తనను సరిగ్గా చూసుకోలేరని చెప్పేవారని అంటోంది.
Meet Donald Trump's daughter from Pakistan 😭
pic.twitter.com/IebSWyB74X— Ghar Ke Kalesh (@gharkekalesh) November 7, 2024
ఈ వీడియోలో నిజానిజాల సంగతేమో గానీ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. తన ఉఛ్చారణను జమునాపర్ నుంచి దక్షిణ ఢిల్లీకి మార్చిందని ఒకరు, ఇవానా ట్రంప్‌ను గుర్తు చేసిందని మరొకరు కామెంట్ చేశారు. ఇదేదో కపిల్ శర్మ కామెడీ షోలా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు. వాస్తవానికి మొత్తం పాకిస్తాన్‌కు తండ్రి యూఎస్ అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తే బంధుత్వాలు గుర్తొస్తాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు.
Also read: DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మళ్లీ పెరగనున్న డీఏ ఎంత ఎప్పటి నుంచి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.