Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా పారిపోవాల్సిందే, వీడియో వైరల్

Elephant - Lions Video: ''పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తుంది.. '' అనే డైలాగ్ తెలుగులో ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. అలాంటి సింహాల మందే.. గజరాజు కోపానికి పరుగులు పెట్టాయి. తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 06:22 PM IST
Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా పారిపోవాల్సిందే, వీడియో వైరల్

Elephant - Lions Video: సాధారణంగా అడవికి రాజు సింహం (Lion). ఇవీ చాలా బలమైన జంతువులు. ఎలాంటి దానినైనా వేటాడి తినగలవు. మృగరాజుకు ఎదురెళ్లే ధైర్యం ఏ జంతువుకు లేదు. అందుకే సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి.. అనే డైలాగ్స్ రాసుంటారు మన మేకర్స్. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ ఏనుగుకు కోపం రావడంతో...సింహాలన్నీ అక్కడి నుంచి పరుగులెట్టాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ సింహాల గుంపు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కానీ అవి ఏనుగుకు దగ్గరలోనే ఉంటాయి. దీంతో గజరాజుకు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే ఘీంకరిస్తూ.. సింహాల వైపు దూసుకెళ్తుంది. దీంతో సింహాలన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. ఒక ఏనుగు (Elephant) కోపానికి...సింహాల మంద పారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా సింహాల గుంపు ఒంటరిగా ఉన్న జంతువును చూసి పారిపోవు. వేటాడే అవకాశం ఉన్నా పరిగెత్తాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్1 అనే వీడియోలో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 87 వేల మంది వీక్షించగా.. 6 వేల మందికి పైగా లైక్లు కొట్టారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @africanwildlife1

Also Read: Shocking Video: ఇంత పెద్ద అనకొండను మీరెప్పుడైనా చూశారా?.. వైరల్ అవుతున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News