Twins Born Different Years : రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు, ఇదెలా సాధ్యమయ్యిందంటే..

Twins Born in Different Years : కాలిఫోర్నియాలో ఒక జంటకు రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. 2021లో ఒకరు 2022లో మరొకరు జన్మించారు. ఈ ట్విన్స్ స్టోరీ తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 08:45 PM IST
  • Twins Born in Different Years : కాలిఫోర్నియాలో ఒక జంటకు రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు. 2021, 2022 ట్విన్స్ స్టోరీ.
  • రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు
  • కాలిఫోర్నియాలో జరిగిన అద్భుతం
  • 2021లో 2022లో మరొకరు..
Twins Born Different Years : రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు, ఇదెలా సాధ్యమయ్యిందంటే..

Twins Born in Different Years Meet The California Twins : సాధారణంగా చాలా మందికి కవలలు పుట్టడమే కాస్త అరుదుగా ఉంటుంది. ట్విన్స్ పుడితే ఆ దంపతుల ఆనందాలకు అవధులుండవు. ఇద్దరు పిల్లలు ఒకే కాన్పులో జన్మిస్తే అదృష్టంగా భావిస్తారు చాలా మంది. అయితే కవలలు సాధారణంగా కొందరు నిమిషాల్లో వ్యవధుల్లో మరికొందరు గంటల వ్యవధుల్లో పుడుతుంటారు. అయితే కాలిఫోర్నియాలో ఒక జంటకు పుట్టిన కవలల మధ్య వ్యత్యాసం సంవత్సరాల్లో ఉంది. అది ఎలా సాధ్యం అంటారా.. ట్విన్స్‌లో ఒకరు 2021 డిసెంబర్ 31న రాత్రి జన్మిస్తే.. మరొకరు 2020 జనవరి 1న పుట్టారు.

2021 డిసెంబర్‌‌ 31న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మొదటి చిన్నారి జన్మించగా.. 15 నిమిషాల తర్వాత అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 2022 జనవరి 1న మరో చిన్నారి పుట్టారు. ఇలా 15 నిమిషాల తేడాతో పుట్టిన ఈ ట్విన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.

ఈ కవలలు కేవలం 15 నిమిషాలతో తేడాతో జన్మించినప్పటికీ రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంతో వార్తల్లో నిలిచారు. వీరి పుట్టక చాలా అరుదు అంటూ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా రేర్‌‌గా జరుగుతాయంటున్నారు. 

ఆల్ఫ్రెడో ( Alfredo) అనే అబ్బాయి, అతని బుల్లి చెల్లి ఐలిన్‌లు (Aylin) ఈ రికార్డ్ క్రియేట్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ నగరానికి (Greenfield city) చెందిన ఫాతిమా మాడ్రిగల్, (Fatima Madrigal) రాబర్ట్ ట్రుజిల్లో (Robert Trujillo) దంపతులకు వీరు జన్మించారు. "బేబీ ఐలిన్ యోలాండా ట్రుజిల్లో (Baby Aylin Yolanda Trujillo) 2022లో జన్మించగా.. ఆమె కవల సోదరుడు.. ఆల్ఫ్రెడో ఆంటోనియో ట్రుజిల్లో, (Alfredo Antonio Trujillo) 2021లో జన్మించాడు. ఈ విషయాన్ని నాటివిడాడ్ మెడికల్ సెంటర్ (Natividad Medical Center) తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.

 

Also Read : Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

ఈ శిశువులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టిన సమయంలో.. అమ్మాయి ఐలిన్ సుమారు 2.66 కిలోల బరువుతో ఉంది. అబ్బాయి ఆల్ఫ్రెడో సుమారు 2.75 కిలోల బరువుతో పుట్టాడు. తనకు పుట్టిన బిడ్డలపై తల్లి ఫాతిమా మాడ్రిగల్ (Fatima Madrigal) సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు కవలు పిల్లలు పుట్టడం వారిద్దరూ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంపై ఆమె హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఈ డెలివరీ చేసిన డాక్టర్ (doctor) అనా అబ్రిల్ అరియాస్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ డెలివరీని తాను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు.

Also Read : Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News