Viral Video: మనం ప్రతిరోజూ ఇంటర్నెట్లో అనేక రకాల వింత వీడియోలను చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఓ చిన్నారి కొండచిలువతో నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే చాలా మంది పిల్లలు పాములను చూసి బయటపడతారు. కానీ ఈ చిన్నారి ఎలాంటి భయం లేకుండా ఆ పాను పక్కలో పెట్టుకుని పడుకోవడం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. కొంతమందైతే భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు ఇంటర్నేట్లో కనిపించడం చాలా అరుదు.
ఏం జరిగింది చివరికి..?:
మీరు ఈ వీడియోను చూస్తే ఆ చిన్నారి ఎలాంటి భయం లేకుండా ఆ పామును పక్కలో పెట్టుకుని పడుకుంటుంది. ఇది పెంపుడు పాము కావడంతో ఆ పాపను కాటేయకుండా ముద్దుగా చూసుకుంటోంది. బొద్దింకలను చూసి భయపడే చిన్న పిల్లలు.. ఇలా కొండచిలువతో పడుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో చాలా చక్కర్లు కొడుతున్నాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజాధరణ పొందుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు తినిపించడం, వాటికి నీళ్లు పోయడం, వాటితో పాటు ఆడుకోవడం వంటి వీడియోలే అధికం.
గతంలో కొన్ని వీడియోలలో స్నేక్ క్యాచర్స్ వాటీతో దైర్య సాహాసాలు చేసి.. వాటిని పట్టుకుని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తారు. అయితే ఇదే క్రమంలో కొన్ని సందర్బాల్లో కాటుకు కూడా గురై మరణిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో వారు పాములకు ఆహారాలను కూడా తినిపిస్తున్నారు. ఇంకొందరైతే వాటికి నీటిని కూడా తాగిపిస్తున్నారు. అయితే ఇలాంటి అరుదైన సన్నివేశాలు చూసి జనాలు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంకొదరైతే అతి భయంకరమైన పాములను సైతం కూడా ముద్దు పెట్టుకుంటున్నారు.
ఈ చిన్నారి పామును పట్టుకుని నిద్ర పోతున్న వీడియో స్నేక్ మాస్టర్ అగ్నోస్టిక్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ ఖాతాలో వీడియోలు చూస్తే ఆ పాప పాములతో నిర్భయంగా ఆడుకోవడం వంటి సన్నివేశాలను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను ఇప్పటికీ 2,145 మంది వీక్షించారు. అంతేకాకుండా చాలా మంది కామెట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ కావడం చాలా అరుదు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook