కొన్ని ఘటనలు కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకుంటుంటాం... కాని అప్పుడప్పుడు నిజ జీవితాల్లోనూ సినిమాటిక్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే సినిమాలు చూసి వీళ్లు ఇన్‌స్పైర్ అయ్యారో లేక... ఇలాంటి వాళ్లనే చూసి సినిమా వాళ్లు కథలు రాసుకుంటున్నారో అనిపించేటటువంటి విచిత్రమైన ఘటన ఇది. ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌లో జనవరి 5న సినీ ఫక్కీలో జరిగిన ఓ వివాహం ( Cinematic wedding ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహం ప్రత్యేకత ఏంటంటే... వరుడు ఒక్కడే కానీ వధువులు మాత్రం ఇద్దరు ఉన్నారు. అవును... మీరు చదివింది నిజమే.. ఒకే మండపంలో (Wedding mandap) తన లవర్స్ ఇద్దరిని వివాహం చేసుకున్నాడు వరుడు.
ఈ 1+1 ఆఫర్ పెళ్లి ( One groom, two brides ) కంటే ముందుగా ఓ పెద్ద సినిమా స్టోరీ లాంటి కహానీయే ఉంది. వరుడి పేరు చందు మౌర్య. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చందు మౌర్య కూలీ పని చేసుకుంటూ ఉన్నదాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం ట్రైబల్ గాళ్ అయిన సుందరి కశ్యుప్‌తో చందు ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయంచుకున్నారు. తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తల్చినట్టు చందూ ఫేట్ మరోలా ఉంది. సుందరితో ప్రేమలో ఉండగానే ఓ ఏడాది తర్వాత తమ బంధువుల పెళ్లిలో పరిచయం అయిన హసీనా అనే యువతితో చందూ మరోసారి ప్రేమలో పడ్డాడు.
Also read : COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?
తాను అప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని హసినాకు అసలు విషయం చెప్పాడు. అయినా సరే ఫోన్‌లో టచ్‌లో ఉందామని చెప్పిన హసినాతో సెకండ్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇదిలావుండగానే హసినా ఓ రోజు ఏకంగా చందూ ఇంటికే వచ్చి అతడితోనే సహజీవనం మొదలుపెట్టింది. చందూతో హసినా సహజీవనం చేస్తోందని తెలుసుకున్న సుందరి కశ్యప్ కూడా అతడి ఇంటికి వచ్చింది. అలా చందూ ఇద్దరితో సహజీవనం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టిన గ్రామస్తులు ఖాప్ పంచాయతీ పెట్టారు.
సహజీవనం మ్యాటర్ (Live-in relationship) పెద్దది కావడంతో సుందరిని, హసినాను ఇద్దరినీ ఇష్టపడుతున్న చందూ ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకు తమకు ఏం అభ్యంతరం లేదని సుందరి, హసినా చెప్పడంతో ఇలా ఇద్దరు లవర్స్‌ని (Lovers) పెళ్లి చేసుకునేందుకు మార్గం సుగుమమైంది. తాము కూడా వెరీ హ్యాపీ అంటున్నారు సుందరి, హసినా.
Also read : COVID-19 పూర్తిగా నయమైనా... ఈ సమస్యలు తప్పవా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook