Red King Cobra Viral Video Shakes Internet: ప్రతిఒక్కరు తరచుగా పాములను చూస్తూనే ఉంటారు. ఎప్పుడూ తెల్లటి లేదా నల్లటి పాములను చూస్తుంటారు. చాలా అరుదుగా ఆకుపచ్చ రంగులో ఉండే ఆములవాస్య పామును చూస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఎర్రటి రంగులో ఉండే పామును చూసుండరు. సినిమాల్లో కూడా రెడ్ పామును దాదాపుగా ఎవరూ చూసుండరు. రెడ్ కలర్ స్నేక్ ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ రెడ్ కలర్ స్నేక్ కూడా ఉంది. అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఎక్కువగా వియత్నాంలో ఉన్నాయట. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఆగ్నేయాసియా దేశం వియత్నాం. బీచ్‌లు, నదులు, బౌద్ధ గోపురాలు మరియు సుందర నగరాలకు వియత్నాం ప్రసిద్ధి. నదులు, అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఇక్కడ అరుదైన జాతులకు చెందిన పాములు కూడా ఉంటాయి. అరుదైన జాతికి చెందిన రెడ్ కలర్ స్నేక్‌లు కూడా వియత్నాంలో ఉన్నాయి. 'స్నేక్ క్యాచర్స్' అనే యూట్యూబ్ ఛానెల్లో రెడ్ కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం... ఇద్దరు వ్యక్తులు పొలం పనులు చేస్తుంటారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టు మొదట్లో రెడ్ కింగ్ కోబ్రా మరో వ్యక్తికి కనిపించడంతో భయంతో కేకలు వేస్తాడు. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని పాము కోసం వెతుకుతుంటారు. ముందుగా తెల్లటి రంగులో ఉన్న పాము కనిపించగా దాని బంధిస్తారు. పొదల్లో ఉన్న రెడ్ కింగ్ కోబ్రా వీరిని చూసి నీటిలోకి పారిపోతుంది. అయినా కూడా దాన్ని వెంబడించి పట్టుకుంటారు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాము చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!
Also Red: బుసలు కొడుతూ దూసుకొచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టిచేతులతో ఎంత ఈజీగా కంట్రోల్ చేశాడో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook