Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 24, 2024, 07:15 PM IST
  • ఉడుముకే చుక్కలు చూపించిన మహిళ..
  • వైరల్ గా మారిన వీడియో..
Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Monitor lizard attacks on woman video viral: సాధారణంగా కొంత మంది చిన్న బల్లి, బొద్దింక ఇంట్లో కన్పించిన భయంతో కేకలు వేస్తుంటారు. ఇక పాము పొరపాటున వస్తే.. ఇంకేం వీరి గుండె అక్కడే ఆగిపోతుందని కూడా చెప్పుకొవచ్చు. అయితే.. కొన్నిసందర్బాలలో ఇంట్లోకి అడవిలో ఉండే జీవులు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా అడవులు, చెట్లు, పొదలు ఉన్న చోట ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్ ఘఢ్ లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

 

ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. సాధారణంగా ఉడుము అంటే మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అది చూసేందుకు భయంకరంగా ఉంటుంది. ఉడుము పట్టు చాలా బలంగా ఉంటుందంట. అది పొరపాటున దేన్నైన పట్టుకున్న, దాడి చేసిన దాని అంతం చూసే వరకు వదలదంట. అలాంటి ఉడుముకు ఒక మహిళ చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఛత్తీస్ ఘడ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.  invincible._ajita అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.  ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీనిలో ఒకరి ఇంట్లో భారీ ఉడుము నీళ్ల ట్యాంక్ లో కన్పించింది. వెంటనే వారు పాముల్ని పట్టడంలో ఎక్స్ పర్ట్ అయిన ఒక మహిళకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే అక్కడకు చేరుకుని ఉడుమును తన చేతులతో పట్టేసుకుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్లు దూరంగా పారిపోతుంటే.. ఈమె మాత్రం ఖాళీ చేతులతో.. ఉడుమును పట్టేసుకుంది.

Read more: Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?

మరోవైపు ఉడుము దాడి చేస్తున్న కూడా ఆమె ముఖంలో ఏమాత్రం భయంలేదే. ఎంతో చాకచక్యంగా ఉడుమును పట్టుకుని దాన్ని బంధించి దగ్గరలోని అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. నువ్వు తోపు.. గ్రేట్ అక్కా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News