Dussehra 2023 Date and Significance: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా లేదా విజయదశమిని అక్టోబర్ 24, మంగళవారం జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, విజయదశమి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈ దసరా రోజున రెండు అత్యంత పవిత్రమైన యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పవిత్రమైన రోజున నీలకంఠ పక్షిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. దసరా నాడు ఏ సమయంలోనైనా మీరు నీలకంఠ పక్షిని చూస్తే.. మీ ఇంట్లోకి ఆనందం, ఐశ్వర్యం వస్తుందని నమ్ముతారు. ఈ రోజున బంగారం, ఆభరణాలు మరియు కొత్త బట్టలు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజిస్తారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిందని నమ్ముతారు, అందుకే ఈ పండుగను శారదీయ నవరాత్రుల పదవ రోజున జరుపుకుంటారు. దసరా రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని పురాణాలు చెబుతాయి. దీనిని బట్టే అధర్మంపై ధర్మానికి విజయంగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు.
శుభ ముహూర్తం మరియు శుభ యోగాలు
హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 23వ తేదీ సోమవారం సాయంత్రం 5.44 గంటలకు దశమి తిథి ప్రారంభమై అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, పవిత్రమైన దసరా పండుగ అక్టోబర్ 24, మంగళవారం జరుపుకుంటారు. దసరా రోజు ఉదయం 6.27 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రవి యోగం, మధ్యాహ్నం 3:40 నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధి యోగం ఉన్నాయి.
ఆయుధ పూజ సమయం
దసరా రోజున ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున విజయ ముహూర్తంలో శాస్త్ర పూజ చేస్తారు. అక్టోబర్ 24 నాడు శాస్త్ర పూజకు అనుకూలమైన సమయం మధ్యాహ్నం 01:58 నుండి మధ్యాహ్నం 02:43 వరకు ఉంటుంది.
రావణ దహనం యొక్క శుభ సమయం
దసరా రోజున లంకాధిపతి రావణుడు, అతని సోదరుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా మంచి ముహూర్తంలో చేయడం మంచిది. రావణ దహనం యొక్క శుభ సమయం అక్టోబర్ 24 సాయంత్రం 5:43 నుండి రెండున్నర గంటల వరకు ఉంటుంది.
Also Read: Diwali 2023: దీపావళి రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook