Lunar Eclipse 2023: 9 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక చంద్రగ్రహణం..ఈ గ్రహణం ఏం సూచించబోతోంది.?

Lunar Eclipse 2023 October: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఏయే సమయంలో పౌర్ణమి పూజలు చేయాలో.. చంద్రగ్రహణం ప్రత్యేక సమయం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 10:26 AM IST
Lunar Eclipse 2023: 9 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక చంద్రగ్రహణం..ఈ గ్రహణం ఏం సూచించబోతోంది.?

 

Lunar Eclipse 2023 October: జ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమిలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పౌర్ణమి ఏర్పడుతూ ఉంటాయి. ఈ అక్టోబర్ 28 రోజున శరత్ పూర్ణిమ వస్తోంది. ఈరోజు భక్తులంతా రాత్రిపూట చంద్రుడికి ఖీర్ ను సమర్పిస్తారు. అయితే ఈ అక్టోబర్ 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో చంద్రుడికి ఖీర్ ని సమర్పించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం ప్రభావం భారత్ పై కూడా పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

చంద్రగ్రహణం ఎప్పుడు సంభవించబోతోంది..
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అశ్విని శుక్ల పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీన సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం ప్రభావం తప్పకుండా భారతదేశంపై కూడా పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భారతదేశంతో పాటు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. 

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

ఖగోళ శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏర్పడబోయే చంద్రగ్రహణం మొత్తం 16 దిశల్లో కనిపిస్తుంది. ఈ చంద్రుని నుంచి వచ్చే కిరణాలు అమృతాన్ని చిమ్ముతున్నట్లుగా కనిపిస్తాయని సమాచారం. దాదాపు 9 ఏళ్ల క్రితం కూడా ఇలానే ఏర్పడిందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని రాశుల వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

పౌర్ణమి ప్రారంభ సమయం:
చంద్రగ్రహణం రోజు శరత్ పూర్ణిమ అక్టోబర్ 28వ తేది ఉదయం 3 గంటల 17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. అయితే పౌర్ణమి పూజలు చేయాలనుకునేవారు తప్పకుండా ఉదయం 4:10 నిమిషాల వరకు మతపరమైన కార్యక్రమాలు చేయవచ్చు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News