Magh Purnima 2023 Horoscope Rashifal: ఈ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన మాఘ పూర్ణిమ రాబోతోంది. హిందూ మతం ప్రకారం.. మాఘ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గ్రహాల ప్రత్యేక సంయోగం జరిగే అవకాశాలున్నాయి. గ్రహాల ప్రత్యేక సంయోగాలు ఏర్పడినప్పుడు పలు రాశులవారి జీవితాల్లో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశులవారికి శుభాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభాలు జరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పలు రాశులవారు అదృష్టాన్ని కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారు మాఘ పూర్ణిమ రోజు ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:
మేష రాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆగ్రహానికి కూడా గురవుతారు. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి అతిగా తీపి తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా భారీగా లాభాలు పొందుతారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు అనారోగ్య సమస్యల బారిన పడతారు కాబట్టి తప్పకుండా తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభ రాశి:
వృషభ రాశిరికి ప్రత్యేక సంయోగాలు ఏర్పడడం కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం తగ్గి ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ క్రమంలో ఆర్థిక పరమైన విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో స్నేహితుల మద్దతు లభించి చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ క్రమంలో వీరు స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. ఈ రాశివారి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా వీరు వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాల పాలయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగంలో ఏదైనా అదనపు బాధ్యతలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి మనస్సు ప్రతికూల ఆలోచనలను నిండి ఉంటుంది. కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అంతేకాకుండా ఈ క్రమంలో ఆదాయం తగ్గి ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది.
Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!
Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook