Vastu Tips: వాస్తు అనగానే ఎంతో కష్టమైన విషయం అని అందరూ అనుకుంటారు కానీ పాటించడం చాలా సులభమే. వాస్తు పరంగా మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల సైంటిఫిక్ గా మీరు ఏమి నష్టపోరు.. అయితే ఎంతో కొంత లాభపడతారని అంటారు వాస్తు శాస్త్రజ్ఞులు. అలా వాళ్ళు చెప్పే ఎన్నో విషయాలలో రాగి సూర్యుడు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తాం.. అంటే కనిపించే దేవుడు ఆయన. మరి అలాంటి సూర్యుడి ప్రతిమను ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి.
అలాంటి వారి కోసం ఈ రోజు రాగి సూర్యుని ఇంట్లో ఎలా? ఏ మూల ?పెట్టుకోవాలి దానివల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంటిలో సామాన్లు సర్దే విషయంలో ఏ మూల ఏది ఉంచాలి? ఎలా పెట్టుకోవాలి అనే విషయంలో కూడా వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాగి సూర్యుడు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడమే కాకుండా దుష్టశక్తులను దరి చేరనివ్వడు అని వాస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయం.
రాగితో చేసిన సూర్యుడి మూర్తి.. ఇంటిలో పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యం ప్రసాదించే సూర్యుని నిత్యం కొలవడం వల్ల మన జీవితంలో ఎంతో మెరుగైన ఫలితాలను మనం పొందుతాం. సూర్యుడి ఆశీస్సులు పొందిన వారికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎటువంటి చికాకులు తలెత్తవు. మన వాస్తు ప్రకారం రాగి సూర్యుడు ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో కలహాలు లేకుండా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
అయితే రాగి సూర్యుడిని ఇంట్లో ఏ దిశలో ఉంచుతాము అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ రాగి సూర్యుడు ప్రతిమను గోడపై నిర్దిష్ట దిశలో జాగ్రత్తగా ఉంచాలి. బలమైన ఆకర్షణ కలిగిన ఈ రాగి సూర్యుడు మీ జీవితంలోకి మంచి పురోగతితో పాటు గౌరవ మర్యాదలను కూడా ఆకర్షిస్తాడు. మీ ఇంట్లో తూర్పు దిశలో ఏదైనా మార్గం లేదా తూర్పు గోడపై రాగి సూర్యుడిని ఉంచడం శ్రేష్టం. ఇలా చేయడం వల్ల వాస్తు ప్రకారం మీ ఇంటికి ఏదైనా లోపాలు ఉన్నా వాటిని కూడా అధిగమించవచ్చు. ఒకవేళ మీ ఇంటి ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు బయట రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంటిలో సంపద పెరుగుతుంది.
మరి ఎన్ని లాభాలు ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి రాగి సూర్యుడుని.. సరైన దిక్కులో పెట్టుకుని చూడండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం వాస్తు నిపుణుల సూచనలు మేరకు సేకరించడం జరిగింది. వీటిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి