Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటేనే ఓ మంచి ముహూర్తం. ఎంత మంచి రోజంటే.. ఇక శుభ ముహూర్తం చూసుకోకుండానే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అటువంటి అక్షయ తృతీయ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...
ప్రతియేటా ఈ సంవత్సరం అంటే 2022లో మే 3వ తేదీన వస్తోంది. హిందూవులకు అత్యంత పవిత్రమైన, శుభదినం ఈ రోజు. అందుకే అక్షయ తృతీయ నాడు ఎక్కువగా పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, కొనుగోళ్లు, కొత్త వ్యాపారాలు, గృహ ప్రవేశాలు వంటి శుభాకార్యాలన్నీ కన్పిస్తుంటాయి. ముఖ్యంగా కొనుగోళ్లకు అక్షయ తృతీయ చాలా మంచిదనేది ఓ నమ్మకం. ప్రత్యేకించి ఇవాళ్టి రోజున బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని అంటారు. ఇవాళ్టి రోజున కొన్న వస్తువులు దీర్ఘకాలం మన్నుతాయని చెబుతారు. వృద్ధి కలుగుతుందని నమ్ముతారు.
అక్షయ తృతీయ నాడు సాధారణంగా బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బంగారం ధరల కారణంగా అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే కేవలం బంగారం ఒక్కటే కాదు.. అక్షయ తృతీయ నాడు ఏ వస్తువులు కొనుగోలు చేసినా వృద్ధి ఉంటుందని.. కుబేరుడి దయ, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు. శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ నాడు బంగారమే కాకుండా.. ధాన్యం, జొన్నలు కూడా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన వాటిని విష్ణు భగవంతుడికి సమర్పించాలి. ఆ తరువాత ఓ ఎర్రటి వస్త్రంలో చుట్టి.. మీ ఖజానాలో భద్రం చేసుకోవాలి. అంతే మీ ఇంట అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతుంటాయి.
లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ నాడు గవ్వలు కొని లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించాలి. ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు చేయాలి. మరుసటి రోజు ఈ గవ్వల్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఖజానాలో దాచుకోవాలి. ఇక ఇదే రోజున శ్రీయంత్రం కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదం. శ్రీయంత్రాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించాలి. శ్రీయంత్రం ఇంట తీసుకొస్తే..చాలా లాభాలు ఆర్జిస్తారని అంటారు. ఇక శంఖం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికీ ధనం, సుఖ సంతోషాలతో ఉంటారని చెబుతారు.
Also read: Panchak: నేటి నుంచి రాజ్ పంచకము.. అసలేంటి పంచకము.. దీని ప్రభావం ఎలా ఉంటుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.