Akshaya tritiya Mercury Transit In Aries In Telugu : ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ మే 10న రాబోతోంది. ఈ పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దానధర్యాలు చేచడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. మే 10న బుధుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహాన్ని మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివికి సూచికగా పరిగణిస్తారు. కాబట్టి ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో సంచారం చేస్త అదృష్టం రెట్టింపు అవ్వడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మేష రాశిలోకి బుధుడు సంచారం చేయడం కారణంగా ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి:
అక్షయ తృతీయ పండుగ రోజు ఏర్పడే గజకేసరి ప్రభావం వృషభ రాశివారిపై పడబోతోంది. దీని కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీరికి ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్ట్ లభించి ఆస్తి పరమైన విషయాల్లో లాభాలు పొందుతారు. అలాగే వీరికి మతపరమైన కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.
మిథునరాశి:
అక్షయ తృతీయ రోజు నుంచి మిథున రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వ్యాపారాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ఒప్పందాలు జరిగి ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు వీరి కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరు ఎలాంటి పరీక్షలు రాసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పాత స్నేహితులకు కూడా కలిసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఆదాయంలో మార్పులు వచ్చి ఆస్తులు పెరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహరాశి:
సింహరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో ఆస్తులు, సంతోషం పెరుతాయి. అలాగే వీరికి వాహన సౌఖ్యం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కూడా పొందుతారు. దీంతో పాటు వీరు పిల్లల నుంచి శుభవార్త పొందవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి