Good Luck Sign: మీకు ఉదయాన్నే ఇలాంటి సంఘటనలు జరిగితే... మీరు త్వరలో కోటీశ్వరులే..!

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు బిచ్చగాడైనా సరే బిలియనీర్ అవుతాడు. మీరు సడన్ గా కోటీశ్వరులవ్వడం, భారీగా డబ్బు సంపాదించారంటే దానికి ఆ తల్లి కృపే కారణం. మీకు ఉదయాన్నే ఈ సంఘటనలు జరిగితే.. భారీగా డబ్బు వస్తుందని అర్థం  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 10:57 AM IST
Good Luck Sign: మీకు ఉదయాన్నే ఇలాంటి సంఘటనలు జరిగితే... మీరు త్వరలో కోటీశ్వరులే..!

Lucky Sign about Money:  మీకు ఆకస్మాత్తుగా డబ్బు రావడం, కొన్ని రోజుల్లోనే ధనవంతులవ్వడం, ఒక్కసారే బిజినెస్ లో మీరు ఊహించినంత లాభం రావడం.. ఈ సంఘటలన్నింటికీ గల కారణాలను జ్యోతిష్యశాస్తంలో చెప్పబడ్డాయి. ఇలా జరిగేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి లక్ష్మీదేవి (Goddess Laxmi) అనుగ్రహానికి సంకేతాలు. అలాంటి వాటి గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం ఈ శుభ సంకేతాలు ధనాన్ని తెస్తాయి
ఉదయాన్నే జేబులోంచి పడే నాణెం: జ్యోతిష్యం ప్రకారం, ఉదయం జేబులోంచి డబ్బు పడిపోతే అది శుభసూచకం. ఇది డబ్బు సంపాదించడానికి లేదా కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడానికి సంకేతం.

చేతి నుండి రాలుతున్న డబ్బు: మీరు ఉదయం ఎవరికైనా డబ్బు ఇస్తూ మీ చేతుల నుండి మనీ పడిపోతే, అది ఇచ్చేవారికి మరియు స్వీకరించేవారికి ఇద్దరికీ శుభప్రదం. మీరిద్దరూ ఎక్కడి నుంచో డబ్బు సంపాదించబోతున్నారని దాని అర్థం. ముఖ్యంగా ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు తిరిగి రావడానికి ఇది సంకేతం.

ఉదయం పూట డబ్బుతో పర్సు నిండడం: మీరు ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు.. పర్సు నిండా డబ్బు నింపితే... అది మీపై లక్ష్మిదేవి అనుగ్రహానికి సంకేతం. మీరు భారీ మెుత్తం లాభం పొందబోతున్నారని అర్థం. 

స్వీపర్ కనిపిస్తే: మీరు ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు.. ఎవరైనా తుడుచుకుంటూ కనిపిస్తే.. అది చాలా మంచి సంకేతం. ఇది మీ పనిలో విజయాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా గోల్డెన్ డేస్ రాబోతున్నాయని అర్థం. 

Also Read: Jupiter Retrograde 2022: రేపు గురుడు తిరోగమనం.. 4 నెలల పాటు ఈ రాశులవారిపై ధన వర్షం!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News