astrology: గ్రహాల్లో సర్వసైన్యాధ్యక్షుడైన కుజుడు త్వరలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం అంగారకుడు శని రాశైన మకరంలో ఉన్నాడు. త్వరలో మకరం నుంచి శని స్వక్షేత్రమైన కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు లభించనున్నాయి. మరికొన్ని రాశుల వారు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయవచ్చు. శని రాశైన కుంభంలోకి కుజుడు ప్రవేశచంతో ఏయే రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
శని రాశిలోకి అంగారకుడి సంచారం వల్ల మేషరాశికి ఎంతో మేలు జరగనుంది. మేషం స్వతహా కుజుడి స్వక్షేత్రం కాబట్టి ఈ సమయంలో ఈ రాశుల వారికీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని ఆర్ధిక లాభాలను అందుకుంటారు. మీరు అద్భుతమైన శక్తితో ఉంటారు. మీ కెరీర్ ఊహించని వేగంతో ప్రయోజనకరంగా ఉండనుంది. స్నేహితులు, బంధు మిత్రులతో సమయాన్ని గడుపుతారు.
సింహ రాశి..
కుజుడు రావి మార్పు సింహ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగిపోతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతు ఉంటుంది. ఈ సమయంలో మీకు దూర ప్రయాణాలు కలిసొస్తాయి.
కుంభ రాశి..
కుంభ రాశి వారికీ అంగారకుడి కుంభ రాశి ప్రవేశం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ పని అందరి చేత మెచ్చుకోబడుతుంది. ఈ సమయంలో మీ పై అధికారులు మీ పనిపై సంతోషంగా ఉంటారు. వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook