Astrology: ఈ రాశుల వారిపై శని దేవుడి అపార కరుణ.. పెళ్లికానీ ప్రసాద్ లకు వివాహా యోగం..

Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కరుణ ఉంటే చాలు ఎలాంటి కష్టకార్యములైనా.. సులభంగా నెరవేరుతాయి. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా యోగంతో పాటు అనుకోని ధన లాభం కలగనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 8, 2024, 01:38 PM IST
Astrology: ఈ రాశుల వారిపై శని దేవుడి అపార కరుణ.. పెళ్లికానీ ప్రసాద్ లకు వివాహా యోగం..

Astrology - Shani Transit: నవగ్రహాల్లో శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంబోధిస్తూ ఉంటారు. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలో మారడానికి దాదాపు రెండున్నర యేళ్లు పడుతుంది. మందంగా ప్రయాణిస్తాడు గనుక ఈయనకు మందుడని పేరు. ముఖ్యంగా నవగ్రహాల్లో శని దేవుడు సంచరించే రాశితో పాటు దానికి ముందు వెనకాల రాశి కలిపి ఏల్నాటి శనిగా పిలుస్తారు. ఏల్నాటి శని ప్రభావం వల్ల జీవితంలో ఆటంకాలు.. సమయానికి పనులు జరగకపోవడం వంటివి జరగుతూ ఉంటాయి. శని దేవుడి స్థాన చలనం వల్ల శుభాశుభా ఫలితాలుంటాయి.

శనిదేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో పూర్వ భాద్రపద  రెండవ పాదంలో సంచరిస్తున్నాడు. ఆగష్టు 18 న, శని పూర్వ భాద్రపద నక్షత్రం యొక్క మొదటి స్థానంలో వక్రంలో సంచరించబోతున్నాడు. అంతేకాదు శనీశ్వరుడు అక్టోబరు 3న శతభిషా నక్షత్రంలో నాలుగో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. పూర్వ భాద్ర  నక్షత్రానికి అధిపతి గురువు మరియు శతభిషా నక్షత్రానికి అధిపతి రాహువు. అటువంటి పరిస్థితిలో, బృహస్పతి  శని సంచారము వలన రాబోయే 87 రోజులు ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..

కన్యా రాశి

కన్యా రాశి వారికి శనీశ్వరుడి స్థాన చలనం వల్ల అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. న్యాయపరమైన విషయాల్లో  విజయం సాధిస్తారు. గత కొన్నేళ్లుగా వివాహాం కానీ వారికీ ఈ  యేడాది వివాహా యోగం ఉంది. వ్యాపారస్థులకు అనుకూల ప్రయోజనాలుంటాయి. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా స్ఠాన చలనం కావచ్చు. అదే సమయంలో ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.

కుంభ రాశి
కుంభ రాశిలో శని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన మీ పనులు  ఊపందుకుంటాయి. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఈ యేడాది తప్పక వివాహాం జరగే అవకాశం ఉంది.  సంపద పెరిగే అవకాశం కూడా మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా  తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అదే సమయంలో వ్యాపారస్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం.   

కుంభ రాశి
కుంభ రాశి వారికి  శని దేవుడి సంచారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికీ  0కుటుంబం మరియు పూర్వీకుల నుండి ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. శనీశ్వరుని అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం, కీర్తి ప్రతిష్టలు ఓ రేంజ్ లో  పెరుగుతాయి. అంతేకాదు ఆర్ధికంగా కుదురుకుంటారు.

పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.

ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News