Budh Margi 2022: అక్టోబర్ 2 నుండి బుధుడి ప్రత్యక్ష సంచారం.. ఈ 3 రాశులవారికి లక్కే లక్కు..!

Mercury Margi 2022: గ్రహాల రాకుమారుడుగా పిలువబడే బుధ గ్రహం అక్టోబర్ 2న తిరోగమనంలో నుండి మార్గంలోకి రాబోతుంది. బుధుడి యెుక్క ఈ మార్గం కొన్ని రాశులవారికి అపారమైన సంపదతోపాటు సమాజంలో వారి గౌరవాన్ని పెంచబోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2022, 10:06 AM IST
Budh Margi 2022: అక్టోబర్ 2 నుండి బుధుడి ప్రత్యక్ష సంచారం.. ఈ 3 రాశులవారికి లక్కే లక్కు..!

Budh Planet Margi 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో అంటే అక్టోబరు 2న బుధుడు మార్గంలోకి రాబోతుంది. సెప్టెంబరు 10న కన్యారాశిలోకి ప్రవేశించాడు బుధుడు. అప్పడి నుండి గ్రహాల యువరాజు తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరులో బుధుడు సంచారంలోకి (Budh Margi 2022) వస్తాడు. ఈ బుధ మార్గి కొన్ని రాశులవారు అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు (Sagittarius): బుధుడి మార్గం వల్ల ఈ రాశివారు శుభవార్తలు వింటారు. కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. మీరు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందవచ్చు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగానికి సంబంధించి పర్యటనలు చేసే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.  

వృశ్చికం (Scorpio): మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.  మీరు స్టాక్ మార్కెట్, లాటరీ లేదా ఇతర మార్గాల నుండి ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. 

సింహం (Leo): బుధుడు మార్గం వల్ల మీరు కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉపాధ్యాయులు, లాయర్లు, మార్కెటింగ్ చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీరు మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.  

Also read: October Festival list 2022: అక్టోబరు నెలలో రానున్న వ్రతాలు, పండుగలు ఇవే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News